Doctor Case : డాక్టర్ హత్యాచార కేసు..సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
- By Latha Suma Published Date - 05:15 PM, Sun - 18 August 24

Kolkata Doctor Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసుని సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును ధర్మాసనం ఆగస్టు 20వ తేదీన విచారణ చేపట్టనుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇప్పటికే ఈ కేసుపై విచారణ జరిపిన కోల్‌కత్తా హైకోర్టు కేసుని సీబీఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ వేగవంతమైంది. సీబీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్‌ని విచారిస్తున్నారు. తోటి డాక్టర్‌లు, హాస్పిటల్ సిబ్బందితోనూ విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 మందికిపైగా పేర్లని నివేదికలో చేర్చినట్టు తెలుస్తోంది. దోషులకు కఠిన శిక్ష పడాలని ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఈ నేపథ్యంలోనే నిందితుడికి మానసిక పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం.. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నుంచి ఐదుగురు నిపుణుల బృందం పర్యవేక్షణలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మానసిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు ఆ బృందం ఇప్పటికే నగరానికి చేరుకుంది. ముందుగా సిద్ధం చేసుకున్న జాబితా నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షల అనంతరం కోర్టు అనుమతితో బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్ వంటి ఇతర పరీక్షలు సీబీఐ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు.
Read Also: Imanvi Esmail : టాక్ ఆఫ్ ది టౌన్‌గా ప్రభాస్ కొత్త హీరోయిన్