Gujarat Assembly Elections : ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి…సూరత్ రోడ్ షోలో ఘటన..!!
- Author : hashtagu
Date : 28-11-2022 - 5:58 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను కారులోకి ఎక్కించారు. మీడియాపై కూడా దాడి జరిగింది. పలు కెమెరాలు ధ్వంసం అయ్ాయయి. దీంతో ఆప్ కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
चुनाव प्रचार में आज सूरत के कतारगाम की जनता के साथ रोड-शो। LIVE https://t.co/e5mldYuzE9
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 28, 2022
సూరత్ లోని హీర బజార్ లో జరిగిన బహిరంగ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాంతరం మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు కేజ్రీవాల్ . సూరత్ లో వ్యాపారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఐలవ్ యూ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా ద్రుష్టిలో ప్రతి వ్యాపారి వజ్రమే అన్నారు. వ్యాపారులకు ప్రభుత్వం ఎలాంటి చేయూతనివ్వడంలో విఫలమైందని ఆరోపించారు. సూరత్ లోని వజ్రాల వ్యాపారులు, రత్నాల కళాకారులను భారతరత్నతో సత్కరించాలన్నారు. గుండాయిజం చేసి మమ్మల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తనకు వ్యాపారులు చెప్పారని కేజ్రివాల్ ఈ సందర్భంగా అన్నారు.