HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sipping Tea As Bengal Burns Bjp Trains Guns On Trinamool Mp Yusuf Pathan Over Murshidabad Violence

Yusuf Vs BJP : టీ తాగిన యూసుఫ్‌ పఠాన్‌ .. బీజేపీ భగ్గు

‘‘ఓ వైపు వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్(Yusuf Vs BJP), మాల్దా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు జరుగుతుంటే.. మరోవైపు కూల్‌గా యూసుఫ్‌ పఠాన్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సరికాదు’’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.   

  • By Pasha Published Date - 12:34 PM, Sun - 13 April 25
  • daily-hunt
Yusuf Pathan Trinamool Mp Tea Sip V Bjp Bengal Murshidabad Violence

Yusuf Vs BJP : టీమిండియా మాజీ  క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తరఫున బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. బహరంపూర్ అనేది ముర్షిదాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది.  భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలోని సుతి, ధులియా, సంసేర్‌గంజ్ సహా పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈతరుణంలో శనివారం రోజు ఎంపీ యూసుఫ్‌ పఠాన్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన స్టైలిష్ ఫొటో ఒకటి షేర్‌ చేశారు.  ఆ ఫొటోలో.. యూసుఫ్ కాఫీ తాగుతూ దర్జాగా, ఉల్లాసంగా కనిపించారు. ఈ ఫొటోను చూసి బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Yusuf Pathan (@yusuf_pathan)

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 13 నుంచి 19 వరకు రాశి ఫలాలను తెలుసుకోండి

సిగ్గుగా అనిపించడం లేదా? : షెహజాద్ పూనావాలా 

‘‘ఓ వైపు వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్(Yusuf Vs BJP), మాల్దా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు జరుగుతుంటే.. మరోవైపు కూల్‌గా యూసుఫ్‌ పఠాన్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సరికాదు’’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.   ‘‘పఠాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడిపోతుంటే వారిని ఆదుకోకుండా, కనీసం పరామర్శించకుండా ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్‌ మండిపోతోంది. పోలీసులు మౌనంగా ఉన్నారు. మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ ఒక ఎంపీగా ఉండి కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. తన నియోజకవర్గంలో హిందువులు ఊచకోతకు గురవుతున్న క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది తృణముల్‌ కాంగ్రెస్‌ అంటే’’ అని పూనావాలా ఫైర్ అయ్యారు.

Also Read :New Political Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత సన్నిహితుడి స్కెచ్

రెండు రోజుల్లో 118 మంది అరెస్ట్

వక్ఫ్‌ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పాటు జరిగిన నిరసనల్లో ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా, పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రెండు రోజుల వ్యవధిలో నిరసనల్లో పాల్గొన్న 118 మందిని అరెస్టు చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై బెంగాల్ శాసనసభ విపక్షనేత సువేందు అధికారి కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వివరాలను తమకు నివేదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengal
  • bjp
  • Murshidabad Violence
  • Tea Sip
  • Trinamool MP
  • Yusuf Pathan
  • Yusuf Vs BJP

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

    Latest News

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    • Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

    • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

    • Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd