HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Sack Ajay Mishra Farmers Murder

India: మోడీ గారు మీ మౌనానికి అర్థం ఏంటి ?

లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే.

  • Author : hashtagu Date : 17-12-2021 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే. అయితే ఈ ఘటన పై విచారణ కొరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను నియమించింది. తాజాగా సిట్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ జిల్లా కోర్టుకు నివేదిక సమర్పరించారు.లఖీంపుర్ ఖేరీ ఘటన ప్రణాళికా బద్ధంగా చేసిన నేరమేనని కావాలనే ఆశిష్ మిశ్ర కారును రైతుల పైకి ఎక్కించారని మా విచారణలో భాగంగా తేలింది అని పేర్కొంది. కావున కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్ర పై నమోదైన ఐపీసీ సెక్షన్ 279( రాష్ డ్రైవింగ్), సెక్షన్ 338 (హాని కలిగించడం) లకు బదులు సెక్షన్ 326, 307( అట్టెంప్ట్ టు మర్డర్) కింద కేసు నమోదు చేయాలనీ కోర్టును కోరింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో ఆశిష్ మిశ్ర ప్రథమ ముద్దాయిగా గా ఉన్నాడు. రైతులపైకి ఎక్కించిన కారులో కూడా అయన ఉన్నటు సమాచారం.

పార్లమెంటు లో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు. కనీసం లఖీంపుర్ ఖేరీ ఘటన పై చర్చ జరపాలని డిమాండు చేసినా ఫలితం లేకపోయింది. ఆశిష్ మిశ్ర పై వచ్చిన ఆరోపణలకు తన తండ్రి అజయ్ మిశ్ర ను మంత్రి పదవి నుండి తప్పించడం ఏంటి అని అనుకోవచ్చు. ఆశిష్ మిశ్రాకు రైతులకు భూమి తగాదాలు ఆస్తి తగాదాలు లేవు కాగా.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం లో ఆయన మంత్రిగా ఉన్నారు. కావున ఈ ఘటనను రాజకీయ కోణం లో తప్ప వేరే కోణంలో చూడలేము. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ ఘటన పై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి పై రాష్ట్ర హోంశాఖ నిష్పక్షపాతంగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా విచారణ జరపాలంటే వెంటనే అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి తపించాలి. ఇందులో అజయ్ మిశ్ర హస్తం ఏమైనా ఉందా లేదా అని నిర్ధారించే వరకు అజయ్ మిశ్ర ను ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలి. విచారణ లో మంత్రి అజయ్ మిశ్రాకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్ధారణ అయితే తిరిగి మంత్రి మండలిలోకి తీసుకోవ్వలి. ఈ ఘటన పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడం బాధాకరం. మౌనం కూడా ఒక సందేశమే అని ప్రధానమంత్రి గారు మర్చిపోవద్దు. ఇంత జరిగాక కూడా మోడీ మంత్రి మండలిలో అజయ్ మిశ్ర కొనసాగడం పట్ల మోడీ తనని సమర్ధిస్తున్నాడా అనే సందేహం రాక తప్పదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers protest
  • india
  • lakhimpur kheri
  • modi silent

Related News

Mustafizur Rahman

కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.

  • Maduro Arrest

    వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ , ఇండియాపై ఎఫెక్ట్ పడబోతుందా ?

  • Venezuela

    వెనిజులాలో మారుతున్న సమీకరణాలు.. భారత్‌కు భారీ ప్రయోజనాలు?

  • Bangladesh

    బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ‌!

  • Upi Transactions Records

    రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు

Latest News

  • మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ సర్కార్

  • ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు

  • ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?

  • త్రివేణి సంగమంలో ఘనంగా ప్రారంభమైన “మాఘ మేళ”

  • మోనాలిసా త‌ర‌హాలోనే వైర‌ల్ అయిన ముగ్గురు అమ్మాయిలు.. ఎక్క‌డంటే?

Trending News

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

    • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

    • వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd