HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Rocks From Nepal For Rama Statue In Ayodhya

Rama Statue in Ayodhya: అయోధ్యలో రాముని విగ్రహం కోసం నేపాల్ నుండి శిలలు

అయోధ్యలో (Ayodhya) శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 02-02-2023 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rama statue in Ayodhya
Ayodya

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం సిద్ధమవుతోంది. గుడి నిర్మాణానికి కావాల్సిన శిలల్ని ఎన్నో ఏళ్ల కిందటే తెచ్చిపెట్టారు. వాటితో ఆలయ నిర్మాణం నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా రాముడి విగ్రహాన్ని (Rama Statue) తయారు చేయడం కోసం నేపాల్ నుంచి అరుదైన శాలిగ్రామ్ శిలాఖండాలను తెప్పించారు. కాళీ గందకీ నది నుంచి సేకరించిన 30 టన్నుల బరువున్న శిలల్ని ట్రక్కుల్లో నేపాల్ లోని జనక్ పూర్ నుంచి అయోధ్యకు గురువారం తీసుకొచ్చారు. వాటికి పూజారులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. శిలల్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

రెండు భారీ శిలల్లో ఒకటి 18 టన్నులు, మరొకటి 12 టన్నుల బరువు ఉన్నాయని నేపాల్ అధికారులు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో వాటికి సాంకేతికంగా, శాస్త్రీయంగా అనుమతి వచ్చినట్లు తెలిపారు. శాలిగ్రామ్ శిలలను తరలించే విషయంలో నేపాల్ మాజీ ఉప ప్రధాని బిమలేంద్ర సహకారం అందించారు. సీతమ్మ వారి జన్మస్థలంగా భావించే జనక్ పూర్ లోనే బిమలేంద్ర పుట్టారు.

నేపాల్‌లో కాళీ గందకీ అనే జలపాతం ఉంది. ఇది దామోదర్ కుండ్ నుండి ఉద్భవించి.. నదిగా మారుతుంది. గణేశ్వర్ ధామ్ గండ్కీకి ఉత్తరాన 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు శిలల్ని అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉంది. రెండు బండరాళ్లు దాదాపు 30 టన్నులకు పైగా బరువు ఉంటాయి’’ అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

కేవలం కాళీ గందకీ నదీ తీరంలో దొరికే ఈ పవిత్రమైన శిలల్ని రాముడి విగ్రహాల తయారీలో వాడుతారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అయోధ్యలో రాముడి విగ్రహం (Rama Statue) తయారీ పూర్తి కావచ్చని చెబుతున్నారు. ఈ శాలిగ్రామ్ శిలలతోనే సీతమ్మ వారి విగ్రహం కూడా తయారు చేయనున్నట్టు అయోధ్య వర్గాలు వెల్లడించాయి.

Also Read:  Srikakulam: శ్రీకాకుళంలో భావనపాడు సముద్రతీరంలో విదేశీ డ్రోన్ కలకలం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayodhya
  • india
  • Nepal
  • Rama statue
  • world

Related News

    Latest News

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

    • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

    • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

    • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

    Trending News

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd