Robert Vadra: టికెట్ దక్కకపోవడంతో ప్రియాంక గాంధీ భర్త ఎమోషనల్ పోస్ట్
అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా బరిలోకి దిగవచ్చనే చర్చ జరిగింది. అయితే ఆ స్థానాన్ని కేఎల్ శర్మతో భర్తీ చేశారు. దీంతో టికెట్ దక్కుతుందని భంగపడ్డ రాబర్ట్ వాద్రా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పోస్టులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
- By Praveen Aluthuru Published Date - 05:02 PM, Sun - 5 May 24

Robert Vadra: కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ స్థానాలైన అమేథీ మరియు రాయ్ బరేలీ నుండి తన అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉండగా, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేఎల్ శర్మకు అమేథీ నుంచి టికెట్ దక్కింది. నిజానికి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ వాద్రా బరిలోకి దిగవచ్చనే చర్చ జరిగింది. గత కొంతకాలంగా ఆ ప్రాంతం నుంచి రాబర్ట్ బరిలోకి దిగవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ స్థానాన్ని కేఎల్ శర్మతో భర్తీ చేశారు. దీంతో టికెట్ దక్కుతుందని భంగపడ్డ రాబర్ట్ వాద్రా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పోస్టులో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
“మన కుటుంబం మధ్య ఎలాంటి రాజకీయ అధికారం, పదవులు రావు. మనమందరం ఎల్లప్పుడూ మన దేశ ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తూనే ఉంటాము. అందరికీ ధన్యవాదాలు. నా ప్రజా సేవ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి నేను ఎల్లప్పుడూ సహాయం చేస్తాను అంటూ రాబర్ట్ వాద్రా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెట్టిన కొద్దిక్షణాల్లోనే వైరల్ గా మారింది.
We’re now on WhatsApp : Click to Join
నిజానికి అమేథీ అభ్యర్థిని ప్రకటించకముందే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చాలాసార్లు అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. తనకు ప్రజలకు సేవ చేయాలని ఉందని, కాంగ్రెస్ పార్టీ తనకు ఈ అవకాశం ఇస్తే తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని వాద్రా చెప్పారు. క్రియాశీల రాజకీయాల్లో చేరడంపై వాద్రా చాలాసార్లు మాట్లాడారు. కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చి అమేథీ నుంచి బరిలోకి దింపవచ్చని భావించినా కాంగ్రెస్ హైకమాండ్ ఆ పని చేయలేదు.
Also Read; Peddapalli : కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళా కూలీలు మృతి