Peddapalli : కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళా కూలీలు మృతి
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ (Tractor ) బోల్తా పడి , ముగ్గురు మహిళా కూలీలు మృతి (Women laborers died) చెందారు.
- By Sudheer Published Date - 04:48 PM, Sun - 5 May 24

పెద్దపల్లి (Peddapalli ) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ (Tractor ) బోల్తా పడి , ముగ్గురు మహిళా కూలీలు మృతి (Women laborers died) చెందారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన 9 మంది కూలీలు ఆదివారం ఉదయం రేగడి మద్దికుంట గ్రామ శివారులో మొక్కజొన్న చేనులో పనికి వెళ్లి, తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన లక్ష్మి(45), రాజమ్మ(50), వైష్ణవి(30) అనే ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
We’re now on WhatsApp. Click to Join.
అందులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో చిన్న బొంకూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also : Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా