Hospitals Services Halt : రేపు దేశవ్యాప్తంగా పలు వైద్యసేవల నిలిపివేత : ఫోర్డా
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA)’ ప్రకటించింది.
- Author : Pasha
Date : 11-08-2024 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
Hospitals Services Halt : రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA)’ ప్రకటించింది. ఆగస్టు 9న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యను నిరసిస్తూ ఫోర్డా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆ సంఘం లేఖను పంపించింది. ఆర్జీ కార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి హత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఫోర్డా డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దౌర్జన్యానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరగాలని ఫోర్డా స్పష్టం చేసింది. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని కోరింది. ఈ పోరాటంలో(Hospitals Services Halt) వైద్యులకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాలను ఫోర్డా కోరింది.
Also Read :Hindenburg Research: హిండెన్‌బర్గ్ పాత ఆరోపణలే వల్లె వేస్తోంది.. అవన్నీ అవాస్తవం : అదానీ గ్రూప్
కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో పీజీ సెకండియర్ చదువుతున్న జూనియర్ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం(ఆగస్టు 8న) రాత్రి విధుల్లో ఉన్నారు. ఆగస్టు 9న ఉదయం ఆమె డ్యూటీ చేసిన ఆస్పత్రి సెమినార్ హాలులోనే అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. సదరు జూనియర్ వైద్యురాలిపై లైంగిక దాడి కూడా జరిగిందని ప్రాథమిక శవపరీక్షలో తేలింది. ఆమె నోరు, కళ్లు, ఇతర భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో వెల్లడైంది. శరీరంపై వివిధ గాయాలు కూడా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక తేల్చింది. ఈ కేసులో ఇప్పటికే ఓ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన స్థలంలో దొరికన బ్లూటూత్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకొని హంతకుడిగా తేల్చారు.