HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rbis Diwali Mission Secretly Get 102 Tonnes Of Gold From England To India

Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్‌బీఐ మెగా మిషన్

తాజా గణాంకాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 854.73 మెట్రిక్ టన్నుల బంగారం(Gold Mission) ఉంది.

  • By Pasha Published Date - 10:35 AM, Thu - 31 October 24
  • daily-hunt
Gold Loan
Gold Loan

Gold Mission : మన దేశపు ఖజానాలో బంగారాన్ని నింపే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అడుగులు వేస్తోంది. తాజాగా మరో 102 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి ఆర్‌బీఐ తీసుకొచ్చింది. ఇంతకీ ఎలా తీసుకొచ్చింది ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Indian Army : తప్పుడు ‘సోషల్’ పోస్టులకు చెక్.. భారత ఆర్మీకి కీలక అధికారం

తాజా గణాంకాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 854.73 మెట్రిక్ టన్నుల బంగారం(Gold Mission) ఉంది. అయితే ఇదంతా మన దేశంలోనే లేదు. 510.46 మెట్రిక్ టన్నుల బంగారం మన దేశంలోని ఖజానాలో సేఫ్‌గా ఉంది. మిగతా 324.01 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సంయుక్త కస్టడీలో ఉంది.  ఈ ఏడాది మే నెలలో 100 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఆర్‌బీఐ మన దేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరో 102 టన్నుల బంగారాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. భారీ భద్రత నడుమ ఈ బంగారాన్ని మన దేశానికి తెచ్చారు. 2022 నుంచి ఇప్పటివరకు దాదాపు 214 టన్నుల బంగారం మన దేశానికి తిరిగి వచ్చింది. భవిష్యత్తులో  మరింత గోల్డ్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చే అంశంపై భారత్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.

Also Read :Ravanas Clan : గడ్చిరోలిలో రావణుడి వంశీకులు.. దీపావళి రోజు ఏం చేస్తారంటే..?

పశ్చిమాసియా, ఉక్రెయిన్- రష్యా, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, తైవాన్ -చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో భారత్ తన కరెన్సీ విలువను కాపాడుకునే చర్యల్లో భాగంగా బంగారం నిల్వలను స్వదేశానికి తీసుకొచ్చింది. 2024 మార్చి నాటికి  భారతదేశం వద్దనున్న మొత్తం విదేశీ మారక నిల్వలలో  8.15 శాతం బంగారం ఉండగా.. 2024 సెప్టెంబరు నాటికి అది కాస్తా 9.32 శాతానికి పెరిగింది.  కాగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వద్ద చాలా ప్రపంచదేశాలకు చెందిన బంగారం నిల్వలు ఉన్నాయి. వాటిని తొమ్మిది అండర్ గ్రౌండ్  వాల్ట్‌లలో భద్రపరిచారు. ఆ బ్యాంకు వద్ద దాదాపు 5,350 టన్నుల బంగారం ఉందని ఒక అంచనా. అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద గోల్డ్ కస్టోడియన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు ఖ్యాతి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bank of England
  • diwali
  • england
  • gold
  • Gold Mission
  • india
  • rbi

Related News

Diwali Day

Diwali: దీపావళి రోజు ఏం చేయాలంటే?

Diwali: దీపావళి పర్వదినం సమీపిస్తున్న క్రమంలో, ఇంటింటా ఉత్సాహం నెలకొంది. పండుగ ముందురోజు అభ్యంగన స్నానం చేయడం ఆచారప్రకారం ఎంతో శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు

  • Spiritual

    ‎Spiritual: ఐశ్వర్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం.. దీపావళి రోజు ఎలా వెలిగించాలో తెలుసా?

  • Silver Rate Today

    Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • Diwali (2)

    ‎Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా?

  • Ex Soldier India

    Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Latest News

  • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

  • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

Trending News

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd