Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?
Raihan Vadra Gandhi : తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
- By Sudheer Published Date - 02:17 PM, Tue - 5 November 24

గాంధీ – నెహ్రు కుటుంబం (Gandhi-Nehru Family) నుండి అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇప్పుడు ఐదో తరం వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడా..? అంటే అవుననే చెప్పాలి. ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా ( Priyanka Gandhi son Raihan Rajeev Vadra ).. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని..మేనమామ రాహుల్ గాంధీ (Rahul ) మేనల్లుడి రాజకీయ భవిష్యత్ గురించి ఇప్పటి నుండే ఆలోచన చేస్తున్నాడని..రాజకీయ మెళుకువలు నేర్పుతున్నాడని తెలుస్తుంది.
ప్రస్తుతం 24 ఏళ్ల రైహాన్.. మీడియా దృష్టిలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా ను చూపించేసరికి..అంత రాజకీయ కోణంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రైహాన్ వాద్రా కనిపించారు. రాజీవ్ వాద్రా.. పొలిటికల్ ఫీల్డ్‌కు చాలా దూరంగా ఉంటారు. వైల్డ్ లైఫ్, కమర్షియల్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి ఉన్న రాజీవ్.. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎగ్జిబిషన్ ప్రదర్శనలు చేశారు.
రైహాన్ వాద్రా గురించి తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం.. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి నేతలతో ఆయన ఇటీవల తీసుకున్న వీడియోలు, మరియు వివిధ సందర్భాలలో ఆయన జాతీయ చర్చలో అంగీకారమైన అంశాలు. ఉదాహరణకు.. దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో రైహాన్ వాద్రా రాహుల్ గాంధీతో పాటు ఉండడమే.
Read Also : Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట