Rahul Gandhi: కశ్మీర్ లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ స్కీయింగ్..
కాంగ్రెస్ (Congress) పార్టీ మాజీ చీఫ్ రాహుల్ జమ్మూకశ్మీర్ లోని గుల్మార్గ్ లో సేదతీరుతున్నారు.
- Author : Maheswara Rao Nadella
Date : 16-02-2023 - 11:44 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ (Rahul Gandhi) జమ్మూకశ్మీర్ (Kashmir) లోని గుల్మార్గ్ లో సేదతీరుతున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం కశ్మీర్ చేరుకున్నారు. గుల్మార్గ్ లోని ఓ స్కీయింగ్ రిసార్టులో రాహుల్ గాంధీ విడిది చేశారు. ఈ సందర్భంగా మంచుపై స్కీయింగ్ చేస్తూ ఆయన ఎంజాయ్ చేశారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, వ్యాలీలో జరుగుతున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు రాహుల్ వచ్చారని పార్టీకి చెందిన స్థానిక నేతలు చెప్పారు. రాహుల్ గాంధీ గురువారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారు.
ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ (Kashmir) దాకా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ మొత్తం 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం గుండా సుమారు 4 వేల కిలోమీటర్లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఈ పర్సనల్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రిసార్టులో స్కీయింగ్ ప్రారంభించడానికి ముందు స్థానికులతో రాహుల్ సెల్ఫీలు దిగారు . రాహుల్ గాంధీ స్కీయింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Amazon: అమెజాన్ లో శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్!