Amazon: అమెజాన్ లో శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్!
విజయనగరం (Vijaya Nagaram) జిల్లా చెందిన అమృత్‌కు 24 ఏళ్లు. పుట్టినప్పటి నుంచి తల,
- Author : Maheswara Rao Nadella
Date : 16-02-2023 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
విజయనగరం జిల్లా చెందిన అమృత్‌కు 24 ఏళ్లు. పుట్టినప్పటి నుంచి తల, రెండు చూపుడు వేళ్లు మాత్రమే కదిలించగలరు. స్వతహాగా కూర్చో లేరు. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఇతరుల సాయం అవసరం. అయితేనేం.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కన్నవారి ప్రోత్సాహంతో డిగ్రీ వరకు చదివారు. అంతే ఉత్సాహంతో ఇటీవల అమెజాన్ (Amazon) సంస్థలో కొలువు సాధించారు. పుట్టినప్పటి నుంచే దివ్యాంగుడైన అమృత్‌కు చికిత్స చేయించేందుకు అతని తల్లిదండ్రులు దీప, ఎస్వీజీ శ్రీనివాసరావు ఎన్నో ఆసుపత్రుల్లో చూపించారు. అయినా.. ఫలితం లేదు. మిగతా అవయవాలు పనిచేయవని వైద్యులు చెప్పేశారు. దీంతో కుమారుడికి మానసికంగా ధైర్యం చెబుతూ.. అతన్ని చదివించారు. అమృత్ కూడా చదువులో రాణించారు. పదిలో 9.2 గ్రేడ్, ఇంటర్ ఎంఈసీలో 940 మార్కులు సాధించారు. 2021లో బీకాం పూర్తి చేసి అమెజాన్‌లో (Amazon) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. శాశ్వతంగా ఇంటి నుంచే ఉద్యోగం చేసేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. చిన్నచిన్న సమస్యలకే కుంగిపోయే ఎంతో మందికి అమృత్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: Kodali Nani: వైరల్ అవుతున్న మాజీ మంత్రి కొడాలి నాని బస్సు డ్రైవింగ్..