Rahul Gandhi- Vegetable Market : దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ కు రాహుల్
Rahul Gandhi- Vegetable Market : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ మధ్యకాలంలో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 04:20 PM, Tue - 1 August 23

Rahul Gandhi- Vegetable Market : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఈ మధ్యకాలంలో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు దేశంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ కు వెళ్లారు. ఢిల్లీలోని ఆజాద్‌పుర్ మండిలో షాపులు నడుపుకునే కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులతో రాహుల్ మాట్లాడారు. కూరగాయల ధరల గురించి వారిని ఆరా తీశారు. కూరగాయల ధరలు పెరగడానికి కారణాలు ఏమిటి ? పెరిగిన ధరల వల్ల వ్యాపారులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొనుగోలుదారుల ఇక్కట్లు ఏమిటి ? అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
जननायक राहुल गांधी जी आज दिल्ली की आजादपुर मंडी में सब्जी और फल विक्रेताओं से मिले।
राहुल जी ने उनकी समस्याओं को जाना और समझा।
भारत जोड़ो यात्रा जारी है… 🇮🇳 pic.twitter.com/g0PuMD3tEi
— Congress (@INCIndia) August 1, 2023
రాహుల్ గాంధీ ఆజాదీపూర్ మండీ సందర్శనపై(Rahul Gandhi- Vegetable Market) కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీని సందర్శించారు. అక్కడి వ్యాపారుల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో డ్రైవర్లు, రైతులు, మెకానిక్‌లను కూడా రాహుల్ ఇలాగే సడెన్ గా వెళ్లి కలిశారు. ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళ బాధలు తెలుసుకున్నారు.