HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Bharat Jodo Yatra

Bharat Jodo Yatra : పాదయాత్ర ఫార్మూలా ఎవరెవరికీ వర్కౌట్ అయ్యింది..!

భారత్ జోడో యాత్ర వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ను సమాయత్తం చేసేందుకు...

  • Author : Prasad Date : 07-09-2022 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Jodo Yatra
Bharat Jodo Yatra

భారత్ జోడో యాత్ర వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ ను సమాయత్తం చేసేందుకు, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. 12 రాష్ట్రాల మీదుగా 3500 కి.మీ.ల పొడవునా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ రోజు (సెప్టెంబ్ 7 ) నుంచి కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. సుమారు 160 రోజులకు పైగా పాదయాత్ర చేసేందుకు రాహుల్ గాంధీ ప్రణాళికలు వేసుకున్నారు.

పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ

వాస్తవానికి భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయి. ఆ తర్వాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు.అనంతరం 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బిహార్‌లోని బోధ్‌గయ వరకు నడిచారు. 1983లో అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

వైఎస్ఆర్ విజయంతో పాదయాత్ర ఫార్మూలా సక్సెస్

స్వాతంత్ర్యం తరువాత దివంగత సీఎం వైఎస్ఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలవారు, ఉద్యమకారులు వేర్వేరు కారణాలతో పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర వాటన్నికంటే భిన్నమైనది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో ఆయన ఈ యాత్ర చేపట్టారు. యాత్ర పూర్తయిన కొన్నాళ్లకే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు పాదయాత్రల ఫలాలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు. 2014లో ఆయన సీఎం అయ్యారు. వైఎస్ జగన్ కడపలోని ఇడుపుల పాయ దగ్గరి నంచి 2017లో పాదయాత్రను ప్రారంభించి..2019లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

వైఎస్ ఫ్యామిలీకి పాదయాత్రలతో అనుబంధం

వైఎస్ ఫ్యామిలీలో ముగ్గురు పాదయాత్ర చేసి రికార్డులు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.ఇప్పుడు వైఎస్ఆర్‌టీపీ పేరుతో పార్టీ స్థాపించిన షర్మిలా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సహా మరికొందరు నాయకులు కూడా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు. అయితే ఇప్పటి వరకు పాదయాత్రలు చేసిన నాయకులు ఎవరూ ఫెయిల్ కాలేదు. మరీ రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి పున:ర్ వైభవం తీసుకువస్తోందో వేచి చూడాల్సిందే మరీ…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Bharat Jodo Yatra
  • delhi
  • kashmir to kanyakumari
  • rahul gandhi
  • tamilnadu
  • telangana

Related News

Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu

ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా, వైసీపీ అన

  • Loan App Harassment

    లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి

  • Telangana Rtc Bus Stand

    ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

  • Avinash Reddy

    లోక్‌సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆవేదన

  • Naidu, Pawan discuss politics, strategies

    సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd