Pradhan Mantri Jan Dhan LOOT Yojana: మోదీ సర్కార్ పెట్రోల్ బాదుడుపై.. రాహుల్ గాంధీ కిరాక్ ట్వీట్..!
- Author : HashtagU Desk
Date : 05-04-2022 - 12:02 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ట్విట్టర వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశం ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా గడిచిన 15 రోజుల్లో 13వ సారి ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ సర్కార్ బాదుడు పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ, మోదీ పై విమర్శలు గుప్పించారు.
2014లో ఒక వాహనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎంత ఖర్చు అయ్యేది.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం హాయంలో ఒక వాహనం ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో పోల్చుతూ రాహుల్ గాంధీ షాకింగ్ ట్విట్ చేశారు. ఇక ఆ ట్వీట్‌కు ప్రధాన మంత్రి జన్ ధన్ లూట్ యోజన అన్న హెడ్ లైన్ పెట్టడంతో, ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా పేరు చెప్పి నిత్యావసరాలతో పాటు పెట్రోల్ అండ్ డీజల్ ధరలు పెంచి కనీ వినీ ఎరుగని రీతిలో మోదీ ప్రభుత్వం దోచుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు రికార్డు స్థాయికి పతనం అయినా మోదీ సర్కార్ మాత్రం రకరకాల సెస్‌లతో రేట్లు పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం. మధ్యలో ఏదో నామ్‌కే వాస్తే ఒకటి రెండు సార్లు మాత్రం ధరలు తగ్గించింది తప్పా, ఈ ఎనిమిదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ సార్లు పెంచింది. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ధరల జోలికి వెళ్లకుండా ఆ రాష్ట్రాల ఫలితాలు వెల్లడైన తర్వాత వరస పెట్టి బాదుడు షురూ చేసింది. ఈ క్రమంలో 2014లో ఓ ద్విచక్ర వాహనం ఫుల్ ట్యాంక్ చేయిస్తే 714 రూపాయలు అయితే, ఇప్పుడు అది 1038 రూపాయలకు పెరిగింది. ఒక కారుకు ఫుల్ ట్యాంక్ చేయించటానికి 2014లో 2856 రూపాయలు అయితే, ఇప్పుడు అది 4152 రూపాయలకు పెరిగింది. దీంతో ఏ వాహనంపై ఎంత భారం పడిందనేది తెలుపుతూ, రాహుల్ గాంధీ ఓ ఫోటో ద్వారా చూపించారు.
Pradhan Mantri Jan Dhan LOOT Yojana pic.twitter.com/OQPiV4wXTq
— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2022