Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- By Latha Suma Published Date - 04:45 PM, Fri - 16 February 24

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది.
కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ సాయంత్రం బీహార్ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లోకి (Uttar Pradesh) ప్రవేశించనుంది. న్యాయ్ యాత్ర యూపీలోకి ప్రవేశించిన తర్వాత చందౌలీలో తన సోదరుడితో ప్రియాంక గాంధీ చేరాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఇవాళ యాత్రలో పాల్గొనలేనంటూ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్‌కు చేరుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అనారోగ్యం కారణంగా ఈరోజే నేను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుటపడగానే యాత్రలో చేరతాను’ అంటూ ట్వీట్ చేసింది. యాత్ర యూపీలో ప్రవేశిస్తున్న సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపింది.
రాహుల్ గాంధీ యాత్ర యూపీలోకి ప్రవేశించే సమయంలో ప్రియాంక గాంధీ స్వాగతం పలకాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరడంతో ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొనడం లేదని చెప్పాయి. అయితే, అనారోగ్యానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం వెల్లడించలేదు.
मैं बड़े चाव से उत्तर प्रदेश में भारत जोड़ो न्याय यात्रा के पहुँचने का इंतजार कर रही थी, लेकिन बीमारी की वजह से मुझे आज ही अस्पताल में भर्ती होना पड़ा। थोड़ा बेहतर होते ही मैं यात्रा में जुड़ूँगी। तब तक के लिए चंदौली-बनारस पहुंच रहे सभी यात्रियों, पूरी मेहनत से यात्रा की तैयारी…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024
read also : Aadudam Andhra : ఐపీఎల్‌కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి