Congress : జమ్మూకశ్మీర్‌లో అధికారం మాదే: కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు
Congress : కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ - నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్‌సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 04:45 PM, Sun - 8 September 24

Power in Jammu and Kashmir is ours: జమ్మూకశ్మీర్‌లో త్వరలో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) కాంగ్రెస్ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ -ఎన్‌సీ కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాత్రమే కాదన్న ఆయన.. రాష్ట్రహోదా, అసెంబ్లీ అధికారాల పునరుద్ధరణ కోసమేనని తెలిపారు. సీఎం పదవి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకే దక్కుతుందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎన్నికల వేళ ఇలాంటి ఊహాగానాలు సరికాదన్నారు.
రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం..
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇటీవల కాంగ్రెస్ -ఎన్‌సీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తున్నాయి. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్‌సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండగా.. మిగతా స్థానాల్లో సీపీఎం, జేకేఎన్‌పీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత) ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
10 మందితో బీజేపీ ఆరో జాబితా..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మరో జాబితా విడుదల చేసింది. 10మంది అభ్యర్థులతో ఆరో జాబితాను ఆదివారం ప్రకటించింది. ఎస్సీ రిజర్వు స్థానాలైన కథువా నుంచి భరత్ భూషణ్, బిష్నా నుంచి రాజీవ్‌భగత్, మర్హ్ నుంచి సురీందర్ భగత్ పోటీలో నిలిపింది. బహు సీటు నుంచి విక్రమ్ రంఢ్వాను బరిలో దించుతున్నట్లు బీజేపీ ప్రకటించింది.