HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Narendra Modi Inaugurations Pamban Bridge

PM Modi: డీఎంకే ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష విమ‌ర్శ‌లు.. సంత‌క‌మైనా త‌మిళంలో చేయండంటూ..

అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్ర‌ధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు.

  • Author : News Desk Date : 06-04-2025 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi
Pm Modi

PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఆ రాష్ట్రంలోని భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిను నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం – తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ రైల్వే సముద్ర బ్రిడ్జి ఇది. రామసేతువుతో చారిత్రక సంబంధం ఉన్న ఈ ప్రాంతానికి ఆధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త వంతెన ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ కార్య‌క్ర‌మంకు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ గైర్హాజ‌ర‌య్యారు. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌కు సంబంధించి కేంద్రానికి, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని కార్య‌క్ర‌మానికి త‌మిళ సీఎం స్టాలిన్ హాజ‌రుకాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Also Read: Fact Check : చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డ ఫొటో ఎప్పటిది ?

అక్క‌డ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళ‌నాడుకు కేంద్రం నిధులు పెంచిన‌ప్ప‌టికీ కొంద‌రు నిరాశే వ్య‌క్తం చేస్తున్నార‌ని మోదీ అన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గ‌తంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామ‌ని, 2014 వ‌ర‌కు రైల్వే ప్రాజెక్టుల కోసం రూ. 900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీయే ప్ర‌భుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600 కోట్లు కేటాయించింద‌ని అన్నారు. తమిళనాడు నేతలు తనకు లేఖలు రాస్తున్నారనీ, కానీ ఏ ఒక్కరూ తమిళంలో సంతకాలు చేయడం లేదని అన్నారు. తమిళం మీకు గర్వకారణమైతే కనీసం సంతకాలైనా తమిళంలో చేయాలని కోరుతున్నాను అని మోదీ వ్యాఖ్యానించారు. త‌మిళ భాష‌, వార‌స‌త్వం ప్ర‌పంచం న‌లుమూల‌లా విస్త‌రించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం నిరంత‌రం ప‌నిచేస్తోంద‌ని మోదీ చెప్పారు.

Also Read: Pithapuram : టీడీపీ కార్యకర్తలపై జనసేన కేసులు.. పంచాయితీ ముదురుతుందా?

త‌మిళ భాష‌లో మెడిక‌ల్ కోర్సులు ప్రారంభించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని నేను కోరుతున్నాన‌ని.. ఇందువ‌ల్ల పేద కుటుంబాల పిల్ల‌లు సైతం వైద్యులు కావాల‌నే త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకునే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని మోదీ అన్నారు. మ‌న యువ‌త వైద్యులు కావ‌డానికి విదేశాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా చూడాల‌న్న‌దే త‌మ ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పారు. గ‌త ప‌దేళ్ల కాలంలో త‌మిళ‌నాడు రాష్ట్రంకు కొత్త‌గా ప‌ది మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయ‌ని మోదీ చెప్పారు.

 

ప్ర‌ధాని కార్య‌క్ర‌మంకు హాజ‌రుకాక‌పోవ‌టంపై సీఎం స్టాలిన్ స్పందించారు. రామేశ్వ‌రంలో జ‌రిగే పంబ‌న్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి తాను హాజ‌రు కాలేన‌ని ముందుగానే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి తెలియ‌జేశాన‌ని అన్నారు. రాష్ట్రంలోని నీల‌గిరిలో ఇంత‌కు ముందే నిర్ణ‌యించిన కార్య‌క్ర‌మాల‌కు తాను హాజ‌రు కావాల్సి ఉంద‌ని, అందుకే తాను బ్రిడ్జి ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మానికి రాలేన‌ని తెలియ‌జేశాన‌ని స్టాలిన్ చెప్పారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DMK Government
  • M.K.Stalin
  • narendra modi
  • Pamban Bridges
  • Rameswaram

Related News

PM Modi speaks on the NEET paper leak for the first time; says those responsible will be punished severely.

PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆయన పిలుపునిచ్చారు. పేపర్ లీక్‌లను నిరోధించడం జాతీయ బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇవాళ‌ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరీక

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd