HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Fact Check
  • >Fact Check This Photo Of Shells Falling From Charminar Is From 2019 Not From The April 2025 Incident

Fact Check : చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డ ఫొటో ఎప్పటిది ?

2019లో అదే విధంగా చార్మినార్(Fact Check) నుంచి సున్నం పెచ్చులు ఊడి పడ్డాయి.

  • By Pasha Published Date - 08:05 PM, Sun - 6 April 25
  • daily-hunt
Fact Check Charminar Damage Incident 1

Fact Checked By Factly

ప్రచారం : 2025 ఏప్రిల్‌ 3న హైదరాబాద్‌లోని చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి అంటూ ఒక ఫొటో వైరల్ అయింది.

వాస్తవం : భారీ వర్షాల కారణంగా 2025 ఏప్రిల్ 3న చార్మినార్‌లోని ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయని మీడియాలో చాలా వార్తా కథనాలు ప్రచురితం అయ్యాయి. కానీ ఈ ఫోటో మాత్రం ఇప్పటిది కాదు. 2019లో అదే విధంగా చార్మినార్(Fact Check) నుంచి సున్నం పెచ్చులు ఊడి పడ్డాయి. ఆనాటి ఫొటోనే ఇప్పుడు కూడా వాడారు. కాబట్టి ఈ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని తేలింది.

హైదరాబాదులోని చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయని చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఫొటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) చక్కర్లు కొడుతోంది. అసలు, ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్‌ను మీరు ఇక్కడ చూడొచ్చు.

వాస్తవ తనిఖీలో.. 

  • ఈ ప్రచారాన్ని వేరిఫై చేయడానికి మేం తగిన కీ వర్డ్స్‌ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం. దీంతో మాకు 2025 ఏప్రిల్ 3న హైదరాబాదులో కురిసిన భారీ వర్షం కారణంగా, చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయంటూ ప్రచురితమైన పలు వార్తా కథనాలు కనిపించాయి. (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వార్తా కథనాల ప్రకారం, భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ ఈ సంఘటనకు చెందిన ఈ వార్తా కథనాల్లో ఉన్న ఫొటోలకు, వైరల్ ఫోటోకు మధ్య వ్యత్యాసం ఉందని మేం గమనించాం.  అలాగే ఈ కథనాల్లో.. వైరల్ అవుతున్న ఫొటో కూడా లేదు.

 

View this post on Instagram

 

A post shared by BBC News Telugu (@bbcnewstelugu)

  • దీంతో  వైరల్ అవుతున్న చార్మినార్ ఫొటో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. దీంతో ఆ ఫోటో 2019 నాటిదని తేలింది. 2019 మే నెలలో బీబీసీ తెలుగు ఒక వార్తా కథనం  ప్రచురించింది. దాని  ప్రకారం.. అప్పుడు కూడా ఇప్పటిలాగే  చార్మినార్లోని ఒక మినార్ నుంచి సున్నం పెచ్చులు ఊడి పడ్డాయి.
  • ఈ వార్తా కథనం ప్రకారం ‘చార్మినార్‌కి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత 20-30 సంవత్సరాల్లో అనేకసార్లు చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అప్పుడెప్పుడూ జరగనట్టుగా, ఈసారి 2 మీటర్లపైనే వెడల్పున్న భాగం ఊడి పడింది.’ ఈ కథనంలో ఉన్న ఫొటోకు, వైరల్ ఫొటోకు మధ్య  పోలిక లేదని  నిరూపించే ఫుటేజీని మీరు ఈ కింది కొల్లాజ్‌లో చూడొచ్చు.

ఇదే విషయంపై 2019 మేలో వచ్చిన మరిన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

చివరగా, చార్మినార్ నుంచి పెచ్చులు ఊడి పడ్డ ఈ ఫొటో 2019 నాటిది, 2025 ఏప్రిల్‌లో చోటుచేసుకున్న ఘటనకు చెందినది కాదు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘factly’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Charminar
  • Charminar Damage
  • Charminar Incident
  • Fact Check
  • factly
  • telangana
  • telangana tourism

Related News

Hyderabad

Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

  • Health Insurance

    Health Insurance : ఏపీ, తెలంగాణలో బెస్ట్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఇవే..!

Latest News

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

  • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

  • YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

  • Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd