PM Modi praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఆదర్శం: మోడీ
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని,
- By Praveen Aluthuru Published Date - 02:14 PM, Thu - 8 February 24

PM Modi praises Manmohan Singh: పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని, అయితే ఆయన ఎప్పుడూ దేశానికి మార్గదర్శకంగా వ్యవహరించారని ప్రధాని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడల్లా మన్మోహన్ జీ గురించి తప్పకుండా చర్చిస్తారని మోదీ అన్నారు.
రాజ్యసభలో చాలా మంది ఎంపీల పదవీకాలం ముగుస్తోంది, వీరిలో మన్మోహన్ సింగ్ ఎంపీ పదవి కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్మోహన్ జీతో నాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చని, అయితే వ్యక్తిగతం ఎలాంటి విభేదాలు లేవన్నారు మోడీ. ఆయన ఎప్పుడూ దేశానికి మార్గదర్శకంగా వ్యవహరించేవారని ప్రధాని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడల్లా మన్మోహన్ జీ గురించి తప్పకుండా చర్చిస్తారని మోదీ అన్నారు.
నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా తన విలువైన ఆలోచనలతో మన్మోహన్ సింగ్ ఆరుసార్లు ఈ సభకు భారీ సహకారం అందించారని ప్రధాని మోదీ అన్నారు. మన్మోహన్ సింగ్ వీల్‌ఛైర్‌పై పార్లమెంటుకు వచ్చి ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచిన క్షణం నేను మర్చిపోలేనన్నారు. తమ పార్టీ గెలవదని మన్మోహన్‌కు తెలుసునని, అయినప్పటికీ ఎన్నికల్లో పాల్గొనేందుకు వీల్‌ఛైర్‌పైనే వచ్చారని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: Mutton: మటన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ పదార్థాలు అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు?