Mutton: మటన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ పదార్థాలు అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు?
నాన్ వెజ్ ప్రియులు కొంతమంది చాలామంది ఇష్టపడే వాటిలో మటన్ కూడా ఒకటి. నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేది మటన్ లోనే అన్న విషయం మనందరి
- By Anshu Published Date - 02:00 PM, Thu - 8 February 24

నాన్ వెజ్ ప్రియులు కొంతమంది చాలామంది ఇష్టపడే వాటిలో మటన్ కూడా ఒకటి. నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేది మటన్ లోనే అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి వారానికి ఒక్కసారైనా మటన్ లేనిదే ముద్ద కూడా దిగదు. మటన్ లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మేకపోతూ, పొట్టేలు మాంసాన్ని మటన్ గా పిలుస్తారు. విటమిన్ ఈ, కే సహజ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్, క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, పొటాషియం, సోడియం, ఒమేగాత్రి ఆసిడ్స్ ఉంటాయి. ఈ మటన్ లో కొవ్వును కరిగించే సామర్థ్యం తో పాటు ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి సమస్యలు రాకుండా చూడవచ్చు.
అయితే మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ అతిగా తినడం అస్సలు మంచిది కాదు. అంతేకాకుండా మటన్ తిన్న తర్వాత కూడా మూడు రకాల పదార్థాలను అస్సలు తినకూడదట. మరి మటన్ తిన్న తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం కొలెస్ట్రాల్ మధుమేహం యూరిక్ యాసిడ్ వంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు మటన్ తినకుండా ఉండడమే మంచిది. మటన్ లేదా చికెన్ తినే ముందు లేదా తర్వాత పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలోని వివిధ సమస్యలకు కారణం అవుతుంది.
చాలామంది తిన్న తర్వాత టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ మటన్ తిన్న తర్వాత టీ తాగకండి. ఇది కూడా అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది. కాబట్టి మటన్ తిన్న తర్వాత టీ కాఫీ పాలు వంటివి అసలు తాగకూడదు. అలాగే మటన్ మంచిదే కదా అని చాలామంది వారానికి రెండు మూడు సార్లు తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరు మటన్ పదేపదే తినాలి అనుకుంటే కనుక ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.