Also Read :Storm Control Tech: సంకల్పం గెలిచె.. పిడుగును కంట్రోల్ చేసే టెక్నాలజీ
బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది
‘‘ఉగ్రవాదంపై పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తుంది. బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మరోసారి నేను హామీ ఇస్తున్నాను. ఈ దాడికి కుట్రదారులు, నేరస్థులు అత్యంత కఠినమైన శిక్షను ఎదుర్కొంటారు’’ అని ఆయన స్పష్టం చేశారు.“ఈ ఉగ్రదాడి తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు నిరంతరం సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.ఎంతోమంది ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు. సంతాప సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. వారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు’’ అని మోడీ చెప్పుకొచ్చారు.