HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Attends Viksit Bharat Viksit Rajasthan Programme

PM Modi: ఇప్పుడు కాంగ్రెస్​కు ఉన్న ఏకైక అజెండా ఇదేః ప్రధాని మోడీ

  • Author : Latha Suma Date : 16-02-2024 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi Attends ‘viksit Bharat Viksit Rajasthan’ Programme
Pm Modi Attends ‘viksit Bharat Viksit Rajasthan’ Programme

 

PM Modi on Congress : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్'(Vikasit Bharat Vikasit Rajasthan) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్​లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయని పీఎంఓ తెలిపింది. ఈనేపథ్యంలో మోడీ(modi)మాట్లాడుతూ..కాంగ్రెస్(congress) పార్టీకి ఉన్న ఏకైక అజెండా తనను తిట్టడమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. దేశం గురించి కూడా ఆలోచించకుండా తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఈ క్రమంలో సమాజాన్ని విభజించే అంశాలనూ వ్యాప్తి చేస్తుందని అన్నారు. కుటుంబ రాజకీయమనే విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకుందని, అందుకే ఆ పార్టీ నుంచి అంతా బయటకు వెళ్తున్నారని చెప్పారు.

అవినీతితో కూడిన కాంగ్రెస్(congress) పాలనలో దేశం అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోయిందని, ప్రస్తుతం సగర్వంగా ముందుకెళ్తోందని మోడీ చెప్పుకొచ్చారు. భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు యువత, మహిళలు, రైతులు, పేదలను బలోపేతం చేస్తున్నట్లు మోడీ చెప్పారు. ఈ నాలుగు వర్గాలే తన దృష్టిలో అతిపెద్ద కులాలు అని చెప్పుకొచ్చారు. “స్వాతంత్ర్యం తర్వాత మనకు ఇప్పుడు స్వర్ణయుగం వచ్చింది. గతంలో ఉన్న అసంతృప్తిని వదిలే సమయం మనకు పదేళ్ల క్రితం లభించింది. ఇప్పుడు భారత్(india) ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. 2014కు ముందు దేశంలో స్కామ్​లు, బాంబు పేలుళ్ల గురించే చర్చ వినిపించేది. తమకు, దేశానికి ఏమవుతుందో అనే ఆందోళన దేశ ప్రజల్లో ఉండేది. దూరదృష్టితో ఆలోచించకపోవడం కాంగ్రెస్​తో వచ్చిన పెద్ద సమస్య. సానుకూలమైన విధానాలు తీసుకురావడం కాంగ్రెస్​కు సాధ్యం కాదు. భవిష్యత్ గురించి కాంగ్రెస్ ఆలోచించేది కాదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు కాంగ్రెస్​కు ఉన్న ఏకైక అజెండా మోడీని వ్యతిరేకించడమే. వికసిత్ భారత్, మేడ్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్​కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. ఎందుకంటే వాటికి మోడీ మద్దతు ఇస్తున్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలనే విషవలయంలో చిక్కుకుంది. ఇప్పుడు అంతా కాంగ్రెస్​ను వీడుతున్నారు. ఆ పార్టీలు ప్రస్తుతం ఒక్క కుటుంబమే కనిపిస్తోంది.”

read also : Rajasthan To Telangana : రాజస్థాన్ నుంచి తెలంగాణకు సోలార్ పవర్.. ‘నోఖ్రా ప్రాజెక్టు’ విశేషాలివీ

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ‘Viksit Bharat Viksit Rajasthan’ programme
  • bjp
  • congress
  • pm modi

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd