Petrol Diesel Price Today: దేశంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలోని చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితుల్ని బట్టి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.
- Author : Praveen Aluthuru
Date : 06-11-2023 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
Petrol Diesel Price Today: దేశంలోని చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితుల్ని బట్టి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. నేడు జాతీయ స్థాయిలో చమురు ధరలు మరోసారి స్థిరంగా ఉనప్పటికీ, కొన్ని నగరాల్లో మార్పులు ఖచ్చితంగా చూడవచ్చు. వాస్తవానికి వివిధ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ వేర్వేరు ధరలకు కారణం ఒక్కో నగరం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ ని బట్టి ఉంటుంది .
న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 96.72 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా డీజిల్ పై రూ. 89.62 వద్ద ట్రేడ్ అవుతుంది. తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ రూ. 110.02 కాగా, డీజిల్ లీటరు రూ. 98.80. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ. 106.03, డీజిల్ పై లీటరు రూ. 92.76 కొనసాగుతుంది. నోయిడాలో పెట్రోల్ రూ. 97.00, డీజిల్ రూ. 90.14. గురుగ్రామ్ లో పెట్రోల్ రూ. 96.71, డీజిల్ రూ. 89.59. పాట్నాలో పెట్రోల్ రూ. 107.24 డీజిల్ రూ. 94.04. ముంబైలో లీటరు పెట్రోల్ పై రూ. 106.31, అదే డీజిల్ లీటరుపై రూ. 94.27 వద్ద నడుస్తుంది. చెన్నైలో పెట్రోల్ రూ. 102.63, డీజిల్ రూ. 94.24. బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ. 101.94, డీజిల్ పై రూ. 87.89. భువనేశ్వర్ లో లీటరు పెట్రోల్ రూ. 103.11, డీజిల్ పై రూ. 94.68. చండీగఢ్ లో పెట్రోల్ రూ. 96.20, డీజిల్ రూ. 84.26. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 109.66 వద్ద కొనసాగుతుంటే, డీజిల్ మాత్రం రూ. 97.82 ట్రేడ్ అవుతుంది. ఇక జైపూర్ లో పెట్రోల్ రూ. 108.48, డీజిల్ రూ. 93.72 అలాగే లక్నోలో పెట్రోల్ రూ. 96.56 ఉండగా డీజిలు రూ. 89.75 వద్దకు చేరింది.
Also Read: Bangladesh Vs Sri Lanka : బంగ్లా-శ్రీలంక మ్యాచ్ వాయిదా ?