Bangladesh Vs Sri Lanka : బంగ్లా-శ్రీలంక మ్యాచ్ వాయిదా ?
Bangladesh Vs Sri Lanka : వాయు కాలుష్య సునామీతో దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది.
- By Pasha Published Date - 08:07 AM, Mon - 6 November 23

Bangladesh Vs Sri Lanka : వాయు కాలుష్య సునామీతో దేశ రాజధాని ఢిల్లీ విలవిలలాడుతోంది. అక్కడి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కాలుష్యం అంతగా ప్రమాదస్థాయికి చేరింది. గాలి నాణ్యత ఘోరంగా పడిపోయింది. స్కూళ్లకు ప్రకటించిన సెలవులను కూడా నవంబరు 10 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ వేదికగా షెడ్యూల్ చేసిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ జరుగుతుందా ? జరగదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొల్యూషన్ ఫియర్స్ నడుమ ఈ రెండు టీమ్‌లు ఢిల్లీలోని గ్రౌండ్ ప్రాక్టీస్‌ను కూడా క్యాన్సల్ చేసుకున్నాయి. శ్రీలంక ప్లేయర్స్ శనివారం రోజు బయటికే రాలేదు. కేవలం కొందరు బంగ్లా ఆటగాళ్లు మాస్కులు ధరించి బయటికొచ్చి ప్రాక్టీస్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆటగాళ్లు, ప్రేక్షకుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకాసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఐసీసీ, బీసీసీఐ సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని అంటున్నారు. ఈనేపథ్యంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సేవలను బీసీసీఐ ఉపయోగించు కుంటోందని సమాచారం. గ్రౌండ్, వాతావరణం లేదా ఇతరత్రా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అంపైర్లు భావిస్తే మ్యాచ్‌ను ఆపేయొచ్చని ఐసీసీ నిబంధనలు(Bangladesh-Sri Lanka Match) చెబుతున్నాయి.