Pawan Kalyan -Maharashtra Election : మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం..?
Pawan Kalyan Campaign : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది
- By Sudheer Published Date - 05:35 PM, Thu - 7 November 24

మహారాష్ట్ర ఎన్నికలపై (Maharashtra Elections) బిజెపి (BJP) గట్టి ఫోకసే పెట్టింది. 288 శాసన సభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్న జరగనుండగా..నవంబరు 23న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. మహారాష్ట్రలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది. ఇటీవల, శివసేనలో శిండే, ఠాక్రే వర్గాలుగా విభజన కారణంగా రాజకీయ మార్పులు జరిగాయి. ఈ ఎన్నికల్లో శివసేన (ఎక్‌నాథ్ షిండే వర్గం) మరియు బీజేపీ మధ్య పొత్తు, అలాగే ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే వర్గం గల మహా వికాస్ అఘాడి (MVA) కూటమి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.
ఈ తరుణంలో బిజెపి…మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేత ప్రచారం (Campaign ) చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది. మహారాష్ట్రలో తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగానే ఉంటుంది. ముంబైతో పాటు నాసిక్, నాందేడ్, నాగపూర్ వంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. ఈ తరుణంలో ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయిస్తే బిజెపికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్నీ నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా..పవన్ కళ్యాణ్ తో భేటీ సమయంలో మాట్లాడినట్లు వినికిడి. మహారాష్ట్రలో బిజెపి తరుపున ప్రచారం చేయాలని పవన్ ను అమిత్ షా అడిగినట్లుగా చెబుతున్నారు. వారు అడిగితే చేయను అనే పరిస్థితి ఉండదు కాబట్టి పవన్ అంగీకరించి ఉంటారని భావిస్తున్నారు. బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. చివరిలో పవన్ కల్యాణ్ ను ఒక రోజు .. తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించుకోవచ్చు కానీ.. విస్తృత ప్రచారం ఉండకపోవచ్చంటున్నారు. మరి పవన్ ప్రచారం చేస్తాడా.? లేదా..? అసలు ఆ ప్రస్తావన వచ్చిందా..? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : Telangana High Court : మరోసారి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా