HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan Has The Highest Number Of Terrorists Ghulam Nabi Azad

Terrorists : పాకిస్థాన్‌లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్‌

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.

  • By Latha Suma Published Date - 10:44 AM, Mon - 26 May 25
  • daily-hunt
Pakistan has the highest number of terrorists: Ghulam Nabi Azad
Pakistan has the highest number of terrorists: Ghulam Nabi Azad

Terrorists : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మతతత్వాన్ని ఆయుధంగా మార్చుకుంటూ భారత్‌పై నిరంతరం విద్వేషాన్ని చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా ఎత్తిచూపేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీల బృందాలు ప్రపంచ దేశాలకు వెళ్ళి, పాక్ కపట స్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడించే మిషన్‌లో నిమగ్నమయ్యాయి. ఈ దౌత్య యాత్రల్లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌ను సందర్శిస్తోంది. ఈ బృందంలో ప్రముఖంగా ఉన్న జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.

Read Also: Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు

బహ్రెయిన్‌లోని సామరస్య వాతావరణాన్ని ప్రశంసించిన ఆయన, “ఇది మినీ ఇండియాలా ఉంది. ఇక్కడ మతాలు వేరు అయినా, ప్రజల్లో ఐక్యత అపూర్వంగా ఉంది,” అన్నారు. అఖిలపక్ష బృందం ఏకమై దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని చెప్పారు. తమంతా వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, దేశ ప్రయోజనాల కోసం ఒకటైనామని చెప్పారు. ఇది పాక్‌కు చాలా పెద్ద భేదంగా నిలుస్తుందన్నారు. “పాకిస్థాన్ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశం అయినప్పటికీ, అక్కడ ప్రజల్లో ఐక్యత లేదు. మత ఘర్షణలు, ఉగ్రవాద భావజాలమే అక్కడి రాజకీయ వ్యవస్థకు ఆధారంగా మారాయి,” అంటూ ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన శాంతి యత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు. పాక్ నేతలతో పలు మార్లు శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ప్రయత్నించినా, ప్రతిసారి పాక్ వెన్నులో చీమ కూర్చినట్టు దౌర్జన్యాన్ని చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కీలక ఘట్టంగా నిలిచింది. ఈ ఆపరేషన్‌లో భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని వాయుసేన దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సాధారణ పౌరులకు ఎటువంటి హాని కలగకుండా సున్నితంగా ప్రణాళిక రచించబడినదని గులాం నబీ ఆజాద్ వివరించారు. కానీ, పాక్ మాత్రం భారత సరిహద్దుల్లో నివసిస్తున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా దాడులకు పాల్పడిందని ఆయన వాపోయారు. భారత ప్రభుత్వం ఇప్పుడది దౌత్య యుద్ధానికి రంగం సిద్ధం చేసింది. ఉగ్రవాదంపై భారత్‌ చేపట్టిన పోరాటాన్ని ఇతర దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది. ఈ ప్రయత్నం ద్వారా పాక్‌ను మేకఅవతారం వేస్తున్న రాక్షసునిగా ప్రపంచం ముందు నిలబెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. భారత్ శాంతికి ప్రాధాన్యం ఇచ్చే దేశం. కానీ తన భద్రతకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకోవడంలోనూ వెనుకాడదు. ఈ నేపథ్యంలో భారత వైఖరిని సమర్థంగా ప్రపంచానికి వివరిస్తూ పాక్ మానవ హక్కుల ముసుగులో దాగిన ఉగ్రవాద మనస్తత్వాన్ని ఎండగట్టేందుకు ఈ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.

Read Also: Kavitha Politics : కవిత విమర్శలపై కేటీఆర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే..

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bahrain
  • Ghulam Nabi Azad
  • highest number of terrorists
  • Operation Sindoor
  • pakistan
  • terrorists

Related News

Imran Khan

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులను కూడా ఆయనను కలవడానికి అనుమతించలేదు. దీంతో వారు అడియాలా జైలు వెలుపల ధర్నాకు దిగారు.

  • Imran Khan

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • India

    India: పాకిస్తాన్‌కు భారత్ భారీ షాక్.. కొత్త ఆయుధంతో వణుకుతున్న శత్రుదేశాలు!

Latest News

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

  • Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd