Kavitha Politics : కవిత విమర్శలపై కేటీఆర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే..
కవిత వ్యాఖ్యలు, కార్యక్రమాల గురించి మీడియా వేదికలు, పార్టీ వేదికలు, సోషల్ మీడియాలో స్పందించొద్దని బీఆర్ఎస్(Kavitha Politics) క్యాడర్‌కు సందేశం పంపాలని కేసీఆర్ సూచించారట.
- By Pasha Published Date - 09:03 AM, Mon - 26 May 25

Kavitha Politics : కొన్ని వారాల క్రితం కేసీఆర్‌కు కల్వకుంట్ల కవిత రాసిన లేఖ బీఆర్ఎస్‌లో రాజకీయ ప్రకంపనలు రేపింది. పార్టీలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఆదివారం రోజు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన కేటీఆర్.. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు. కవిత లేఖపై ఇద్దరూ దాదాపు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. కవిత విషయంలో పార్టీపరంగా ఎలా వ్యవహరించాలనే దానిపై కేసీఆర్ గైడెన్స్‌ను కేటీఆర్ కోరారు. దీంతో ఆ విషయాన్ని తనకు వదిలేయాలని, పార్టీ వ్యవహారాలపై పూర్తి ఫోకస్ పెట్టాలని కేటీఆర్‌కు కేసీఆర్ తేల్చి చెప్పారట.
కేసీఆర్ కీలక సూచనలు
కవిత వ్యాఖ్యలు, కార్యక్రమాల గురించి మీడియా వేదికలు, పార్టీ వేదికలు, సోషల్ మీడియాలో స్పందించొద్దని బీఆర్ఎస్(Kavitha Politics) క్యాడర్‌కు సందేశం పంపాలని కేసీఆర్ సూచించారట. ఈ సమాచారాన్ని ఆదివారం రాత్రే పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కేటీఆర్ అందించారని తెలుస్తోంది. కవిత చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శల గురించి ఎక్కువగా చర్చిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ గందరగోళానికి గురవుతుందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సంక్షోభం మరింత ముదిరితే.. దీన్ని అదునుగా చేసుకొని బీఆర్ఎస్‌ను బలహీనపర్చేందుకు ఇతర పార్టీలు కుట్రపన్నే ముప్పు కూడా ఉంటుందని గులాబీ బాస్ చెప్పారట.
Also Read :Cabinet Expansion: టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ దిశగా కదలిక.. నేడు కీలక భేటీ
కవిత ప్రయారిటీ తగ్గించేందుకే.. ?
మొత్తం మీద కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ తర్వాత ఒక విషయం క్లియర్ అయింది. ఇకపైనా బీఆర్ఎస్‌లో కేటీఆర్‌దే పైచేయిగా ఉంటుంది. కవితకు అంతగా ప్రయారిటీ దక్కకపోవచ్చు. ‘‘కవిత వ్యాఖ్యలకు స్పందించకూడదు’’ అనే నిర్ణయానికి వచ్చారంటే.. ఆమెను పట్టించుకోవద్దు అని డిసైడ్ అయినట్టే. తద్వారా కవిత ప్రయారిటీని పార్టీలో మరింతగా తగ్గించాలని యోచిస్తున్నారు. ఈ అంశాన్ని కవిత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. తన సొంత రాజకీయ ప్రస్థానం దిశగా ఆమె కార్యాచరణను వేగవంతం చేసే ఛాన్స్ ఉంది.