NTR Birth Anniversary: ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొందానన్న మోడీ.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్(NTR Birth Anniversary) ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందన్నారు.
- By Pasha Published Date - 10:23 AM, Wed - 28 May 25

NTR Birth Anniversary: ఎన్టీఆర్ దార్శనికత కలిగిన నాయకుడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్(NTR Birth Anniversary) ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడని చెప్పారు. ఆయన నటించిన ప్రతీ పాత్ర, సినీ రంగంలో ఒక ఐకాన్‌లా నిలిచిపోయిందన్నారు.
Also Read :Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు ఎవరో తెలుసా ?
తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
— Jr NTR (@tarak9999) May 28, 2025
‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’’ అని పేర్కొంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Also Read :Miss World Finals : మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో తలపడేది వీరే.. కౌంట్‌డౌన్ షురూ
ఎన్‌టీఆర్.. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్
- భారతదేశంలో సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త ‘అన్న’ నందమూరి తారక రామారావు.
- పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా ఆయన భావించారు.
- ‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్.
- అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారు.
- మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు.
- పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారు.
- కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించారు. పేదల ఆకలి తీర్చారు.