Adani-Hindenburg Case: అదానీ గ్రూప్ పై సుప్రీంకోర్టుని సమయం కోరిన సెబీ
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది. ఈ కేసులో పూర్తి వివరాలను సంపర్పించాల్సింది సుప్రీంకోర్టు సెబీని కోరింది
- By Praveen Aluthuru Published Date - 04:19 PM, Sun - 30 April 23

Adani-Hindenburg Case: దేశంలో సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది. ఈ కేసులో పూర్తి వివరాలను సంపర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు సెబీని కోరింది.దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సుప్రీం ఆదేశించింది. అయితే తాజాగా సెబీ సుప్రీంకు ఓ వినతి పంపింది.
అదానీ గ్రూప్ తరఫున మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) సుప్రీంకోర్టుకు సమర్పించిన దరఖాస్తులో అదానీ గ్రూప్ కంపెనీలలో అక్రమాలకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేదని పేర్కొంది. దీంతో పాటు విచారణ పూర్తి చేసేందుకు మరో ఆరు నెలల సమయం కావాలని కోరింది.
అమెరికన్ షార్ట్ సేల్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి మార్చి 2న సుప్రీంకోర్టు సెబీకి రెండు నెలల గడువు ఇచ్చింది. దీంతో మే 2న సెబీ స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాల్సి ఉండగా, అంతకు ముందు విచారణకు మరింత సమయం కోరింది. ప్రస్తుతం గ్రూప్ లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అయితే గ్రూప్ లావాదేవీలపై విచారణ సందర్భంగా పలుమార్లు వెరిఫై చేసి విశ్లేషించాల్సి ఉంటుంది. దానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది.
జనవరి నెలాఖరులో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు పెరిగాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. దీంతో పాటు ఖాతాల్లో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. ఈ నివేదిక తర్వాత అదానీ షేర్ వాల్యూ 50 శాతానికి పైగా పడిపోయింది. అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేసింది.
Read More: IPL Fans Fight: సన్‌రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అభిమానుల ఫైట్