PM Modi Ravana Posters: రాముడిగా నితీష్.. రావణుడిగా మోదీ పోస్టర్లు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం సాధిస్తున్నట్లు తెలిపే పోస్టర్లు (Posters) పాట్నాలో వెలిశాయి. ఈ పోస్టర్లు ఆర్జేడీ కార్యకర్తలు రబ్రీ దేవి నివాసంతోపాటు ఆర్జేడీ కార్యాలయం వద్ద వెలిశాయి.
- Author : Gopichand
Date : 15-01-2023 - 7:25 IST
Published By : Hashtagu Telugu Desk
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజయం సాధిస్తున్నట్లు తెలిపే పోస్టర్లు (Posters) పాట్నాలో వెలిశాయి. ఈ పోస్టర్లు ఆర్జేడీ కార్యకర్తలు రబ్రీ దేవి నివాసంతోపాటు ఆర్జేడీ కార్యాలయం వద్ద వెలిశాయి. రెండవసారి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్‌లో ఆర్‌జెడితో కలిసి మహాకూటమి ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నారు. అయితే మొదటిసారిగా ఆయన పోస్టర్‌ను రాష్ట్రీయ జనతాదళ్ రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఈ పోస్టర్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను రాముడు, కృష్ణుడితో పోల్చగా, ప్రధాని నరేంద్ర మోడీని రాక్షస రాజు రావణుడు, కంసలతో పోల్చారు.
ఆర్జేడీ కార్యాలయంలో వేసిన పోస్టర్ కంటే.. ఇందులో ఆయన బీహార్‌ను కాకుండా దేశాన్ని నడిపించేందుకు వస్తున్నట్లు కనిపించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ పోస్టర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి స్పష్టం చేయడం విశేషం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. RJD వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ప్రధాని కుర్చీపై చూడాలనుకుంటున్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు.
Also Read: Lalit Modi: ఆక్సిజన్ సపోర్ట్ పై లలిత్ మోదీ
కొన్ని రోజుల క్రితం బీహార్ విద్యా మంత్రి చంద్రశేఖర్ యాదవ్ “రామచరిత మానస్” పై చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. హిందూ మత గ్రంధమైన రామచరిత్మానస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తుందని చెప్పడంతో అతను ఇబ్బందుల్లో పడ్డాడు. రామచరిత్మానస్, మనుస్మృతి, ఎంఎస్ గోల్వాల్కర్ రచించిన బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలు సామాజిక విభజనను సృష్టించాయని మంత్రి అన్నారు. చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా భారతీయ జనతా యువమోర్చా శనివారం ఆర్జేడీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ప్రకటనను సమర్థించిన ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార JD-U కూడా అతని ప్రకటనను విమర్శించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరింది.