NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం: సైబర్ నేరగాళ్ల హస్తం
నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా పేపర్ లీక్ చేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకుని..ఇందుకోసం జార్ఖండ్ లోని జమ్తారాకు చెందిన సైబర్ నేరగాళ్ల సాయం తీసుకున్నాడు.
- Author : Praveen Aluthuru
Date : 25-06-2024 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా పేపర్ లీక్ చేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకుని..ఇందుకోసం జార్ఖండ్ లోని జమ్తారాకు చెందిన సైబర్ నేరగాళ్ల సాయం తీసుకున్నాడు. NEET మరియు UGC-NET పేపర్ లీక్‌కు సంబంధించి డార్క్‌నెట్ కనెక్షన్ కూడా వెలుగులోకి వచ్చింది. నీట్, నెట్ పేపర్లను డార్క్ నెట్ ద్వారా లీక్ చేసేందుకు కుట్ర పన్నారు. పేపర్ లీక్ కోసం సైబర్ నేరగాళ్ల సాయం తీసుకున్నారు.
ఇది మాత్రమే కాదు అతను నీట్ పేపర్‌ను విక్రయించడానికి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా క్రియేట్ చేశాడు. పేపర్ లింక్‌లు టెలిగ్రామ్‌లోనే అభ్యర్థులకు పంపించాడట. ఈ టెలిగ్రామ్ గ్రూపును విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ప్రస్తావించారు. పేపర్ లీక్ అయిన తర్వాత ఆ పేపర్ టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఏ వెబ్‌సైట్ నుంచి సమాచారం హ్యాక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. యూజీసీ నెట్ పరీక్ష జూన్ 18న జరిగింది. పేపర్ లీక్‌లో విదేశీ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.
UGC NET పేపర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లోని హ్యాకర్లు లీక్ చేశారు. పేపర్ లీక్ చేసేందుకు ముందుగా ఎన్టీఏ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. ఆ తర్వాత పేపర్ లీక్ అయింది. దీని తర్వాత పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారం టెలిగ్రామ్‌లో లీక్ అయింది. మొదటి షిప్టులో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న సమయంలో ఇదంతా జరిగింది. పేపర్‌ను లీక్ చేయడానికి హ్యాకర్లు డార్క్ వెబ్‌ను ఉపయోగించారు.
హ్యాకర్లు ఇండోనేషియా భాషలో మాట్లాడుతున్నట్లు మూలాల నుంచి అందిన సమాచారం. టెలిగ్రామ్ గ్రూప్ స్క్రీన్ షాట్‌ల నుండి చాలా ముఖ్యమైన సమాచారం పొందబడింది. చాట్ సమయంలో హ్యాకర్లు ఎన్టీయే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. పేపర్‌తో పాటు తమ వద్ద మొత్తం సమాచారం ఉందని హ్యాకర్లు చెబుతున్నారు.
Also Read: MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాంతించినట్లేనా..?