Naxalites Vs Polling Station : ఏకంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి మావోయిస్టుల వార్నింగ్ !
Naxalites Vs Polling Station : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
- Author : Pasha
Date : 18-04-2024 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
Naxalites Vs Polling Station : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ లోక్‌సభ స్థానంలోని సుక్మా పరిధిలో ఉన్న కెర్లపెడ పోలింగ్ బూత్ గోడలపై ఎన్నికలు బహిష్కరించాలని హెచ్చరికలు రాశారు. ‘‘ఈ పోలింగ్ బూత్‌లో ప్రజలెవరూ ఓటు వేయరు. నాయకులను ఎవరి కోసం ఎన్నుకోవాలి? నాయకులు ప్రజలను మోసం చేస్తారు’’ అని రాశారు. మావోయిస్టుల వార్నింగ్‌తో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. బస్తర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న (శుక్రవారం) శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కెర్లపెడ పోలింగ్ బూత్‌లో 791 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 446 మంది మహిళా ఓటర్లు, 345 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతం కావడంతో బస్తర్ లోక్‌సభ స్థానానికి మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తాజాగా మావోయిస్టుల వార్నింగ్(Naxalites Vs Polling Station) నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
బస్తర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మహేశ్ కశ్యప్, కాంగ్రెస్ తరఫున కవాసీ లఖ్మా పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా బస్తర్ సీటును గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ సైతం ఇక్కడ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బస్తర్ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం 14.72 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో 1961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రదేశాల్లోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, పోలింగ్ సామగ్రిని ఇప్పటికే హెలికాప్టర్లలో చేరవేశారు.