Amit Shah : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: అమిత్ షా
Naxalism: ఇటీవల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 01:19 PM, Fri - 20 September 24

Naxalism: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా .. నక్సల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు. హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని, నక్సల్స్ సరెండర్ కావాలని ఆయన తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానించారు.
Read Also: Weight Loss : స్త్రీల కంటే పురుషులు వేగంగా బరువు తగ్గడం నిజమేనా?
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటుచేయాలని భావించారని కానీ, మోడీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే మావోయిస్టుల అంతానికి ఆల్- అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు జిల్లాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించారన్నారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో మావోయిస్టుల హింసాకాండ బాధితులకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందిస్తుందన్నారు. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణతో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా బాధితులకు సహాయం అందిస్తామని షా వెల్లడించారు.
Read Also: NASA Alerts: మరో ముప్పు.. భూమికి దగ్గరగా మూడు గ్రహశకలాలు..!