Viral Video : సీఎం మాన్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్
Viral Video : పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ సీఎం మాన్‌పై ఆయన కుమార్తె సీరత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు.
- By Pasha Published Date - 12:26 PM, Sun - 10 December 23

Viral Video : పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన తండ్రి మూడోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ సీఎం మాన్‌పై ఆయన కుమార్తె సీరత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ‘‘మా నాన్న(సీఎం మాన్) మూడోసారి తండ్రి కాబోతున్నారని సన్నిహిత వర్గాల ద్వారా మాకు తెలిసింది. తన కుటుంబ బాధ్యతలనే సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి మరొకరికి న్యాయం ఎలా చేస్తారు ? నాన్న.. నమ్మిన వారిని మోసం చేయొద్దు’’ అని తండ్రిని సీరత్ కౌర్ కోరారు. ‘‘మా నాన్న మొదటి నుంచీ మాతో అబద్ధాలే చెబుతున్నారు. ఇప్పుడు పంజాబ్ ప్రజలతో కూడా అదే చేస్తున్నారు. నాకు చేసిన అన్యాయమే పంజాబ్ ప్రజలకు చేస్తున్నారు. నాకు ఆయన పేరును కూడా ఆపాదించవద్దు. మా అమ్మతో విడాకులు వేరే కథ. మా అమ్మను ఎమోషనల్‌గా వీక్ చేసినట్లే, ఇప్పుడు పంజాబ్ ప్రజలను చేస్తున్నారు’’ అని సీరత్ కౌర్ ఆరోపించారు. ‘‘సీఎం మాన్ ఇప్పటికీ విధానసభకు, గురుద్వారా సాహెబ్‌కు మద్యం మత్తులోనే వెళ్తున్నారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు?’’ అని ఆమె ప్రశ్నను సంధించారు.
Very Serious allegations again AAP Punjab CM @BhagwantMann by his daughter.
A must watch.
I did English subtitles for people who aren't fluent in Punjabi. https://t.co/j88lw2iL6x pic.twitter.com/WLWI67nvNq
— Arun Pudur (@arunpudur) December 9, 2023
We’re now on WhatsApp. Click to Join.
సీరత్ కౌర్ వీడియోను(Viral Video) ఆమె తల్లి (భగవంత్ మాన్ మొదటి భార్య) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ దేవుడే పంజాబ్ ప్రజలను రక్షించాలంటూ తన మాజీ భర్తపై ఆమె పరోక్ష విమర్శలు గుప్పించారు. తాను ఈ వీడియోను తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. తనకు, తన కూతురికి రాజకీయాలు చేసే ఉద్దేశం లేదన్నారు. ‘‘కొన్నిసార్లు నిశబ్దంగా ఉండడం కూడా నేరమే. అందుకే మేం సీఎం మాన్ గురించి నోరువిప్పాం’’ అని భగవంత్ మాన్ మొదటి భార్య చెప్పారు. ‘‘విడాకులు తీసుకుంటే తండ్రిగా ఎలాంటి బాధ్యతలు ఉండవని ఏ చట్టం చెబుతోంది ?’’ అని సీఎం మాన్‌ను ఆమె ప్రశ్నించారు. ‘‘పంజాబ్ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టానని చెబుతున్న ఓ కళాకారుడిని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ పంజాబ్ కోసమే సీఎం మాన్ కుటుంబాన్ని విడిచిపెట్టి ఉంటే.. మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు. దయచేసి ఇకనైనా డ్రామాలు మానండి’’ అని సీఎం మాన్‌కు మొదటి భార్య హితవు పలికారు.