Heavy Rain : ముంబై వర్షాలు.. 107 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Heavy Rain : వర్షం కారణంగా ముంబయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్‌లు, ప్రధాన రహదారులు కూడా నీటితో నిండిపోయాయి
- By Sudheer Published Date - 07:51 PM, Mon - 26 May 25

ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai ) మహానగరాన్ని వర్షాలు (Rains) ముంచెత్తుతున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి 16 రోజుల ముందే ముంబయిని తాకడం గమనార్హం. భారత వాతావరణశాఖ ప్రకారం.. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే రుతుపవనాలు ప్రవేశించాయి. ఫలితంగా 107 సంవత్సరాల వర్షపాతం రికార్డు బద్దలైంది. సాధారణంగా జూన్ 11 తర్వాత రుతుపవనాలు ముంబయిలోకి ప్రవేశిస్తుంటే, ఈసారి మాత్రం మే నెలలోనే ముంచెత్తాయి. 1956, 1962, 1971 సంవత్సరాల్లో ఇదే రోజు మే 29న రుతుపవనాలు ముందుగానే వచ్చిన ఉదాహరణలున్నాయని వాతావరణ శాస్త్రవేత్త సుష్మా నాయర్ తెలిపారు.
YSR District Renamed : YSR జిల్లా పేరు మార్పుపై షర్మిల స్పందన
వర్షపాతం పరంగా చూస్తే.. కొలాబాలో ఉదయం 8.30 నుంచి 11.30 గంటల మధ్య 105.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శాంటాక్రూజ్, బాంద్రా, జుహు, చెంబూర్, మహాలక్ష్మి వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షం కారణంగా ముంబయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్‌లు, ప్రధాన రహదారులు కూడా నీటితో నిండిపోయాయి. దీంతో రైలు, రోడ్ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సెంట్రల్ రైల్వే స్టేషన్లు దాదర్, మాటుంగా, బద్లాపూర్ వంటి ప్రాంతాల్లో ట్రాక్‌లు పూర్తిగా మునిగిపోయాయి.
Congress MLAS : ఆ ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి – కేటీఆర్
వర్షం వల్ల దృశ్యమానత తక్కువగా ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదించింది. లోతట్టు ప్రాంతాలైన కింగ్స్ సర్కిల్, దాదర్ టీటీ, పరేల్, చించ్పోక్లి వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వడాలా రోడ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ మరోవైపు సముద్రంలో అలలు 4.75 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.