HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mp Tejasvi Surya Lashes Out Over Ap Bifurcation

BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP's Tejasvi Surya Slams congress party
BJP's Tejasvi Surya Slams congress party

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలను అధికార బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును ఆయన పాకిస్థాన్ విభజనతో పోల్చారు. ఏపీ విభజనను బ్రిటిషర్ల కంటే దారుణంగా చేశారని ఆరోపించారు. విభజన సమయంలో తెలుగు ప్రజల భావోద్వేగాలు, ఆర్థిక వనరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ పాపం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉందని ఆయన విమర్శించారు. విభజన గాయాల నుంచి ఇప్పటికీ ఏపీ కోలుకోలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ విధానాన్ని తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ఆయనకు ఇలాంటి సలహా ఎవరు ఇచ్చారో తెలియడం లేదని, రేవంత్ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ఆదాయం ఏటా మారుతుందని, నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒక ఓటు ఉంటుందని, ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలని అన్నారు. ‘ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదలకు సున్నా ఓట్లు’ అనే తర్కం ప్రకారం ‘ముఖేష్ అంబానీకి లక్ష ఓట్లు, మనలాంటి వారికి ఒక్క ఓటు మాత్రమే’ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

పేద, ధనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు అనే గొప్ప సూత్రాన్ని అందించిందని అన్నారు. దానిని మార్చాలని భావించడం అజ్ఞానమే అవుతుందని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను కల్పించే ప్రక్రియను 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి.. మూడు బిల్లులను లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజన కోసం 131 రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 50 శాతం అంటే 815కు పెంచనున్నారు. ఈ పెంపుతో మహిళలకు 272 సీట్లు లభిస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడం పట్ల విపక్షాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభమైన జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే ముందుకెళ్లాలని అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Reorganization
  • BJP MP
  • BJP MP Tejasvi Surya
  • Chief Minister Revanth Reddy
  • congress party
  • parliament
  • tejaswi surya

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Major changes in the tourism sector... CM Revanth Reddy issues key directives.

    CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

Latest News

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd