Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్‌లో 72 మందికి చోటు.. సామాజిక వర్గాల వారీగా లెక్క ఇదే..!
- By Gopichand Published Date - 01:13 AM, Mon - 10 June 24

Modi 3.0 Cabinet: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము NDA నాయకుడు నరేంద్ర మోదీతో పదవీ ప్రమాణం, గోప్యత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆయన స్వతంత్ర భారతదేశానికి 20వ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని మోదీతో పాటు 71 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రధాని నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త మంత్రుల బృందంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఇందులో 5 మైనారిటీ కులాల ఎంపీలు ఉన్నారు.
వాస్తవానికి మోదీ 3.0లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు అవకాశం ఇచ్చారు. ఇందులో 27 ఇతర వెనుకబడిన తరగతులు, 10 షెడ్యూల్డ్ కులాలు, 5 షెడ్యూల్డ్ తెగలు, 5 మైనారిటీ వర్గాల నాయకులు చోటు దక్కించుకున్నారు. అలాగే 18 మంది సీనియర్ మంత్రులు మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహిస్తారు. ఇందులో రాందాస్ అథవాలే, రవ్‌నీత్ సింగ్ బిట్టు, హర్దీప్ సింగ్ పూరి, పబిత్రా మార్గరీటా, జార్జ్ కురియన్ ఉన్నారు.
రాందాస్ అథవాలే
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, రాజ్యసభ ఎంపీ రాందాస్ అథవాలే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. రాందాస్ అథవాలే మహారాష్ట్ర నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అతను NDA మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత. అయితే గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ మోదీ 3.0లో కూడా ఆయనకు మంత్రి బాధ్యతలు దక్కాయి.
Also Read: Terror Attack: మోదీ ప్రమాణ స్వీకారం వేళ టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
జార్జ్ కురియన్
కేరళకు చెందిన జార్జ్ కురియన్ బిజెపికి న్యాయవాది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అదే సమయంలో మోదీ 3.0లో జార్జ్ కురియన్ మంత్రిమండలిలో చేర్చబడ్డారు. భారతీయ జనతా యువమోర్చా (BJYM) ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగు దశాబ్దాలుగా కేరళ బీజేపీలో ఆర్గనైజేషన్ మ్యాన్‌గా ఉన్నారు.
పబిత్రా మార్గరీటా
కొత్తగా ఏర్పాటైన మోదీ క్యాబినెట్ 3.0లో అస్సాంకు చెందిన బీజేపీ నాయకురాలు పవిత్ర మార్గరీటా మంత్రి పదవికి ఎంపికయ్యారు. మంత్రిగా పబిత్రా మార్గరీటాను నియమించడం ఒక పెద్ద విజయం. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో వర్ధమాన నేతలను కలుపుకుపోవాలనే బీజేపీ వ్యూహాన్ని ఇది హైలైట్ చేస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
హర్దీప్ సింగ్ పూరి
హర్దీప్ సింగ్ పూరీ కూడా మూడవసారి మోడీ ప్రభుత్వంలో భాగమయ్యారు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్దీప్ సింగ్ గతంలో మోడీ ప్రభుత్వంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా.. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. పూరీ రాజకీయ నాయకుడు కాకముందు మాజీ దౌత్యవేత్త. అతను 1974 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. పూరీ 2014లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2020లో యూపీ నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. అంతకుముందు మే 2019లో అతను హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) నియమించబడ్డారు.