బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.
- Author : Gopichand
Date : 19-12-2025 - 5:02 IST
Published By : Hashtagu Telugu Desk
- బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్
- కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసిన ఇల్తిజా ముఫ్తీ
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో ఒక ముస్లిం మహిళ హిజాబ్‌ను లాగినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, నితీష్ కుమార్‌పై FIR నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇల్తిజా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా (గతంలో ట్విట్టర్) స్వయంగా వెల్లడించారు.
Also Read: చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
Lodged a complaint at Kothi Bagh Police Station to file an FIR against Bihar CM Nitish Kumar for violating the dignity of a Muslim woman by forcibly removing her naqaab. Hope @JmuKmrPolice takes cognisance of this violation. Hands off our hijabs & naqaabs. pic.twitter.com/4wu272h8hI
— Iltija Mufti (@IltijaMufti_) December 19, 2025
ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు. ఈ ఉల్లంఘనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.
ముఖ్యంగా ఈ విషయంలో నితీష్ కుమార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఇల్తిజా ముఫ్తీ హిజాబ్, నకాబ్ ధరించడాన్ని సమర్థించారు. ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లో తాను చేసిన ఫిర్యాదు పత్రాన్ని కూడా జత చేశారు.
తన ఫిర్యాదులో ఇల్తిజా ఇలా రాశారు. డియర్ సర్, నేను మీ దృష్టిని ఒక అసహ్యకరమైన ఘటన వైపు మళ్లించాలనుకుంటున్నాను. దీనివల్ల ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఆమె జరిగిన ఘటనను వివరిస్తూ.. అందరి సమక్షంలో ఒక యువ ముస్లిం డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇతరులు నవ్వుతూ ఉండటం మరింత సిగ్గుచేటని పిడిపి నాయకురాలు ఇల్తిజా తన ఫిర్యాదులో ఘాటుగా రాశారు.