చైనా సాయం కోరిన భారత్.. ఏ విషయంలో అంటే?
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
- Author : Gopichand
Date : 19-12-2025 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
Beijing Model: భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఢిల్లీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం ఇటీవల ఈ సమస్యను ఎదుర్కోవడానికి భారత్‌కు కొన్ని సూచనలు చేసింది. భారత్ కోరుకుంటే కాలుష్యాన్ని తగ్గించడంలో చైనా సహాయం చేయగలదని పేర్కొంది. వాస్తవానికి చైనా రాజధాని బీజింగ్ ఒకప్పుడు కాలుష్యం కారణంగా ‘స్మాగ్ క్యాపిటల్’ అని పిలువబడేది. అయితే చైనా ప్రభుత్వం కాలుష్యాన్ని సీరియస్‌గా తీసుకుని, కఠినమైన చర్యలు చేపట్టింది. ఫలితంగా తక్కువ సమయంలోనే బీజింగ్ గాలి మళ్ళీ స్వచ్ఛంగా మారింది.
కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో చైనా సహాయం
చైనా ఎంబసీ ప్రతినిధి యూ జింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తూ.. కాలుష్య నియంత్రణపై చైనా తన ఆలోచనలను భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే చైనా ‘బీజింగ్ మోడల్’ను ఎవరితోనూ పంచుకోవాలని అనుకోవడం లేదని, కానీ వాయు కాలుష్యం అనేది భారత్- చైనా రెండింటికీ సవాలుగా మారిందని ఆమె పేర్కొన్నారు. భారీ జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్మాగ్ (పొగమంచు + కాలుష్యం) నుండి విముక్తి పొందడం అంత సులభం కాదని చైనా కంటే బాగా మరే దేశం అర్థం చేసుకోలేదు. అందుకే భారత్‌కు సహాయం చేయాలని చైనా భావిస్తోంది.
Also Read: దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?
బీజింగ్ కాలుష్యాన్ని ఎలా తగ్గించింది?
బీజింగ్ గాలిని కాలుష్య రహితంగా మార్చడానికి చైనా తీసుకున్న ముఖ్యమైన చర్యలను రాయబార కార్యాలయం వివరించింది.
పాత వాహనాలపై నిషేధం: కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాల వాడకాన్ని చైనా పూర్తిగా నిలిపివేసింది.
లైసెన్స్ ప్లేట్ లాటరీ & ఆడ్-ఈవెన్: బీజింగ్‌లో కాలుష్యాన్ని తగ్గించడానికి లైసెన్స్ ప్లేట్ లాటరీ సిస్టమ్, ఆడ్-ఈవెన్ (సరి-బేసి) నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ఢిల్లీలో కూడా ఆడ్-ఈవెన్ ఫార్ములాను అమలు చేసినప్పటికీ, అక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు.
ప్రజా రవాణా పటిష్టం: ప్రజలు సొంత వాహనాలను కాకుండా ప్రజా రవాణాను వాడేలా మెట్రో, బస్సు నెట్‌వర్క్‌ను చైనా భారీగా విస్తరించింది.
ఈ-వాహనాల ప్రోత్సాహం: దీంతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను వాడటం ప్రారంభించారు.