Maoists : కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన
Maoists : మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలనే విజ్ఞప్తి చేశారు
- By Sudheer Published Date - 01:18 PM, Wed - 2 April 25

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మావోయిస్టు (Maoists ) పోరాటం కొనసాగుతున్న సమయంలో కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలనే విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టులపై తీవ్ర ఒత్తిడిని తెచ్చాయి. వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో, వారు శాంతి చర్చల వైపు అడుగేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Allu Arjun : పేరు మార్చుకోబోతున్న అల్లు అర్జున్ ..కారణం అదేనా?
ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి ఉంది. ఈ రాష్ట్రాల్లో భద్రతా బలగాలు నిరంతరం అల్లర్లను అణచివేసే చర్యలు చేపడుతున్నాయి. మావోయిస్టులు ఈ హత్యాకాండను నిలిపివేయాలని, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మావోయిస్టుల ఈ ప్రకటన ప్రభుత్వ వైఖరిని పరీక్షించే అవకాశముంది. గతంలోనూ మావోయిస్టులు శాంతి చర్చల గురించి ప్రస్తావించినా, అనేక కారణాల వల్ల అవి ముందుకు సాగలేదు.
ఇప్పుడు మావోయిస్టుల నుండి వచ్చిన తాజా ప్రకటనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి చర్చలు జరిగే అవకాశముందా? లేదా ఇది కేవలం తాత్కాలిక నడవడికేనా? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గత అనుభవాల ప్రకారం.. చర్చలు ప్రారంభమైనా అవి కొంతకాలం మాత్రమే కొనసాగి, మళ్లీ హింసాత్మక ఘటనలు జరగడం కనిపించింది. కాబట్టి ఈ ప్రకటనతో నిజంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థిరపడుతుందా? లేదా భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందా? అనేదాని మీద ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుంది.