Heart Attack: మేనకోడలు పెళ్ళిలో మామ డాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో మృతి
ప్రస్తుత కాలంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:40 PM, Thu - 11 May 23

Heart Attack: ప్రస్తుత కాలంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. అప్పటివరకు సంతోషంగా గడిపిన వ్యక్తులు సడెన్ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. ఈ మధ్య ఎక్కువమంది పెళ్లిళ్ల సమయంలో గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా ఇదే ఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటు చేసుకుంది.
మేన కోడలి పెళ్లిలో మేనమామ డాన్స్ చేస్తూ అందర్నీ అలరించాడు. కొంతసేపటికి ఒంట్లో నలతగా అనిపించి కాసేపు స్టేజిపైనే కూర్చున్నాడు. అయితే క్షణాల్లో కుప్పకూలిపోయాడు. అందరు డ్యాన్స్ లో నిమగ్నమై ఉండగా మేనమామ సృహతప్పి పడిపోయాడు. తేరుకున్న కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని స్థానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ కుటుంబలో విషాధచాయలు అలుముకున్నాయి. అప్పటివరకు ఎంతో సంతోషంగా తమతో గడిపిన వ్యక్తి మరణించడంతో పెళ్లి వాతావరణం విషాదమయింది.
10 May 2023 : 🇮🇳 : BSP engineer got 💔attack💉 while dancing at niece's wedding, died#heartattack2023 #TsunamiOfDeath pic.twitter.com/b0dNv3k2Av
— Anand Panna (@AnandPanna1) May 10, 2023
ఛత్తీస్ ఘడ్ రాజానందన్ గావ్ జిల్లా డోంగర్ ఘడ్ లో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడు దిలీప్ రాజ్ కుమార్ బలోడ్ జిల్లాలో నివాసముంటూ ఇంజినీరింగ్ ఉద్యోగం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read More: Ustaad Bhagat Singh Glimpse: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే, ఈసారి ఫర్మామెన్స్ బద్దలైపోవాల్సిందే!