Ustaad Bhagat Singh Glimpse: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే, ఈసారి ఫర్మామెన్స్ బద్దలైపోవాల్సిందే!
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తూ ఊర మాస్ లుక్స్ తో అదరగొడుతాడు.
- By Balu J Published Date - 05:17 PM, Thu - 11 May 23

డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై నేటికి 11 ఏళ్ళు. సరిగ్గా ఇదే రోజు, ఇదే కాంబినేషన్ లో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల కాబోతుండటంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇక మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
భగవద్గీత శ్లోకంతో మూవీ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇస్తూ ఊర మాస్ లుక్స్ తో అదరగొడుతాడు. భగత్.. భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్.. అత్తర్ గంజ్ పాతబస్తీ అనే డైలాగ్ తో ఎంట్రీ ఇస్తాడు. రౌడీలపై రాజీలేని పోరాటం చేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్.. ఈసారి ఫర్మామెన్స్ బద్దలైపోతది అనే డైలాగ్ తో సినిమా గ్లింప్స్ ముగుస్తుంది. ఫస్ట్ గ్లింప్స్ ను చూసిన అభిమానులు మరోసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. పోస్టర్ ను చూసిన పవన్ ఫ్యాన్ కెవ్వు కేక అని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈసారి వినోదం మాత్రమే కాదు’ అని అంటూ క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తిని రేపుతోంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబో ఈ మూవీ వస్తుండంతో అటు టాలీవుడ్ తో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక గ్లింప్స్ కార్యక్రమంలో పవన్ కళ్యాన్ అభిమానుల నినాదాలు మిన్నంటాయి. ‘‘బాబులకే బాబు.. పవన్ బాబు.. జై పవన్.. జైజై పవన్’’ అనే స్లోగన్స్ మార్మోగాయి.
Also Read: Poonam on Pawan: అహంకారమా.. నిర్లక్ష్యమా? పవన్ మూవీపై పూనమ్ ఫైర్!