Assembly Polls 2024 : ఇవాళ మోగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లోని 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Assembly Polls 2024) అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 10:13 AM, Tue - 15 October 24

Assembly Polls 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఇవాళ ప్రకటించనుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలకు కూడా ఇవాళ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించే ఛాన్స్ ఉంది. బై పోల్ జరగాల్సిన లోక్‌సభ స్థానాల జాబితాలోని కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హాట్ ఉన్నాయి. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆయన రాయ్‌బరేలీ ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లోని 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ(Assembly Polls 2024) అనౌన్స్ చేసే అవకాశం ఉంది. యూపీలో బైపోల్ జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో.. కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హాల్ (మెయిన్‌పురి), మిల్కీపూర్ (అయోధ్య), మీరాపూర్ (ముజఫర్‌నగర్), ఘజియాబాద్, మజ్హావాన్ (మీర్జాపూర్), సిసామౌ (కాన్పూర్ నగరం) , ఖైర్ (అలీఘర్), ఫుల్పూర్ (ప్రయాగ్రాజ్), కుందర్కి (మొరాదాబాద్) ఉన్నాయి.
Also Read :Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్
- 288 మంది ఎమ్మెల్యేలు ఉండే మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది నవంబరుతో ముగియనుంది.
- 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే సంవత్సరం జనవరి 5తో ముగియనుంది.
- మహారాష్ట్రలో సీఎం ఏకనాథ్ సిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ కూటమిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), శివసేన (షిండే వర్గం) ఉన్నాయి. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), శరద్ పవార్ వర్గం ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఈదఫా గెలవాలనే పట్టుదలతో ఉంది.
- జార్ఖండ్‌లో ప్రస్తుతం జేఎంఎం – కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. జేఎంఎం కీలక నేత చంపై సోరెన్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఈ అంశం బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది.