Naga Vamsi : దిల్ రాజు వచ్చాకే మీటింగ్ పెట్టుకొని డిసైడ్ అవుతాం.. సీఎం కామెంట్స్ పై నాగవంశీ..
ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ సీఎం కామెంట్స్ పై స్పందించారు.
- By News Desk Published Date - 01:00 PM, Mon - 23 December 24

Naga Vamsi : సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సాక్షిగా ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వనని, తాను సీఎంగా ఉన్నంతకాలం పర్మిషన్ ఇవ్వనని కామెంట్స్ చేసారు. దీంతో సీఎం కామెంట్స్ టాలీవుడ్ లో చర్చగా మారాయి. ఇదే నిజమైతే పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు నష్టాలు తప్పవని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా నేడు నాగవంశీ డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నాగవంశీ సీఎం కామెంట్స్ పై స్పందించారు. నాగవంశీ మాట్లాడుతూ.. FDC చైర్మన్ దిల్ రాజు గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక ఏం చేయాలా అని మీటింగ్ పెట్టుకొని మాట్లాడతాం. ఆ తర్వాతే డిసైడ్ అవుతాం. అయినా సంక్రాంతి సినిమాలకు ప్రీమియర్ షోలు అవసర్లేదు. తెల్లవారు జామున 4.30 గంటలకు షో పడితే చాలు అని అన్నారు.
అలాగే.. చంద్రబాబు గారిని, పవన్ గారిని కలుద్దామని ఇండస్ట్రీలో ఎవరూ చెప్పలేదు. పవన్ గారు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని మాతో ఫస్ట్ మీటింగ్‌లోనే చెప్పారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నాం అని అన్నారు. దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Daaku Maharaj : ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో, ఏపీలో.. ఎప్పుడో తెలుసా?