Lok Sabha Poll – Haircut Is Free : ఓటేస్తే ..కటింగ్ ఫ్రీ అంటూ బోర్డు
ఓటేసి తన సెలూన్‌కు వచ్చి వేలికి రాసిన సిరా గుర్తు చూపించిన వారికి హెయిర్‌కట్ ఉచితమంటూ తన షాప్ ఎదురుగా బోర్డు పెట్టాడు
- Author : Sudheer
Date : 11-04-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీల (Political Leaders) నేతలు అనేక ఆఫర్లు (Offers) ప్రకటిస్తూ ఉంటారు. తమ పార్టీకి ఓటు వేస్తే టీవీలు , ఫ్రిజ్ లు , బంగారం ఇలా నోటికి ఏది వస్తే అవి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తుంటారు. కొంతమంది ముందే బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇది రాజకీయ నేతల స్వలాభం కోసం చేస్తుంటారు. మరోపక్క ఎన్నికల సంఘం సైతం ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి భారీగా ప్రచారం చేస్తుంటుంది. సినీ తారలచేత కూడా ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ముంబై (Mumbai) లో ఏ సెలూన్ షాప్ యజమాని వినూత్నంగా ఓటు హక్కును ప్రతి ఒకరు వినియోగించుకోవాలని ఉద్దేశ్యంతో తనకు నష్టం వచ్చినాసరే ఓ భారీ ఆఫర్ ప్రకటించి వార్తల్లో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే వారికి తన సెలూన్లో ఉచితంగా హెయిర్‌కట్ (Haircut Is Free ) చేస్తానని మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అనే వ్యక్తి ప్రకటించాడు. అకోలాలో ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఓటేసి తన సెలూన్‌కు వచ్చి వేలికి రాసిన సిరా గుర్తు చూపించిన వారికి హెయిర్‌కట్ ఉచితమంటూ తన షాప్ ఎదురుగా బోర్డు పెట్టాడు. పోలింగ్ శాతం పెంచేందుకు తనకు తోచినంతలో వినూత్నంగా ట్రై చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కౌల్కర్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన మహారాష్ట్రలోని 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Read Also : AP : విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్..?