HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Three Iranian Oil Ships Seized Off Mumbai Coast

ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు నౌకలను సీజ్!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 9:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran Oil Tankers
Iran Oil Tankers

Iran Oil Tankers  అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ఆంక్షల జాబితాలో ఉండి, ఇరాన్‌తో సంబంధాలున్న ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు.

స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాగా గుర్తించిన ఈ నౌకలు, అధికారుల కళ్లుగప్పేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నట్లు తేలింది. అంతేకాకుండా, సముద్రం మధ్యలోనే ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును బదిలీ (షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్) చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే విదేశాల్లో ఉన్న యజమానులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.

భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి అంగీకరించిన వెంటనే, అమెరికా భారత వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సంబంధిత నౌకలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ మూడు ట్యాంకర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్‌కు చెందిన ‘నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ’ (NIOC) స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్.. తీరప్రాంత గస్తీని కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం 55 నౌకలు, 12 విమానాలతో నిరంతర నిఘా కొనసాగిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Al Jabziya
  • Asphalt Star
  • Indian Coast Guard
  • Indian Coast Guards
  • Iran oil tankers
  • Maritime Security
  • mumbai
  • National Iranian Oil Company
  • oil smuggling
  • Stellar Ruby
  • US sanctions

Related News

Iran Stops Pakistan-Bound Container Ship SELEN at Strait of Hormuz

Hormuz Strait: పాక్‌కు షాక్‌.. అనుమతి లేదంటూ పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

Iran  హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ నౌకను ఇరాన్ వెనక్కి రప్పించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి అనుమతులను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన కంటైన

    Latest News

    • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

    • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

    • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

    • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

    • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd