Kumbh Mela : యూపీ ప్రభుత్వానికి అఖిలేశ్ విజ్ఞప్తి
అలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం కుంభమేళ గడువును పెంచాలి అని అఖిలేశ్ అన్నారు. ప్రస్తుతం కుంభమేళ నిర్వహిస్తున్న సమయం చాలా తక్కువగా ఉందని.. గతంలో 75 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
- By Latha Suma Published Date - 06:46 PM, Sat - 15 February 25

Kumbh Mela : మహాకుంభమేళ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. కుంభవేళకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా కోట్లల్లో ఉన్న కారణంగా కుంభవేళ గడువు పెంచాలని ఆయన కోరారు. ఇప్పటికూడా చాలామంది మహాకుంభమేళలో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం కుంభమేళ గడువును పెంచాలి అని అఖిలేశ్ అన్నారు. ప్రస్తుతం కుంభమేళ నిర్వహిస్తున్న సమయం చాలా తక్కువగా ఉందని.. గతంలో 75 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Read Also: Lokesh : తప్పు చేసిన వైసీపీ నేతలు తప్పించుకోలేరు : మంత్రి లోకేశ్
ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలు కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ, అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వస్తుండటం గమనార్హం. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.
దీంతో భక్తుల సంఖ్య 50 కోట్లు దాటడంపై స్పందించిన యూపీ ప్రభుత్వం.. భారత్, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని పేర్కొంది. ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది. ఇప్పటికే 50 కోట్లమందికి పైగా గంగానదిలో పుణ్యస్నానమాచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకో పదకొండు రోజుల్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియనుండగా.. భక్తుల తాకిడిలో మాత్రం ఏ మార్పూ లేదు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న వారితో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి.
Read Also: Ex-Goa MLA : ఆటో డ్రైవర్ చేతిలో మాజీ ఎమ్మెల్యే మృతి