Ex-Goa MLA : ఆటో డ్రైవర్ చేతిలో మాజీ ఎమ్మెల్యే మృతి
Ex-Goa MLA : ఆటో డ్రైవర్ ఆయనపై దాడి చేయడం, కొద్ది క్షణాల్లోనే ఆయన కుప్పకూలి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది
- By Sudheer Published Date - 06:17 PM, Sat - 15 February 25

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్ (Former Goa MLA Lavoo Mamledar) (68) దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఆయన కర్ణాటకలోని బెలగావిలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ ఆయనపై దాడి చేయడం, కొద్ది క్షణాల్లోనే ఆయన కుప్పకూలి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లావూ మావ్లేదార్ బెలగావిలోని ఖడేబజార్‌లో ఉన్న ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా, కారు ఢీకొందని భావించిన ఓ ఆటో డ్రైవర్ అతనిపై గొడవకు దిగాడు. వాగ్వాదం పెరిగి, ఆటో డ్రైవర్ మావ్లేదార్‌పై శారీరకంగా దాడి చేశాడు. తీవ్ర ఒత్తిడికి గురైన మావ్లేదార్ కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు.కొద్దిసేపటికే మావ్లేదార్ హోటల్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. హోటల్ సిబ్బంది వెంటనే ఆయనకు సహాయం చేయాలని ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన శ్వాస తీసుకోవడం మానేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆటో డ్రైవర్ దాడి చేసిన తర్వాత మావ్లేదార్ గుండెపోటుకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని తెలియాల్సి ఉంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఓ ఆటో డ్రైవర్ దాడికి బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. హత్య వెనుక నిజమైన కారణాలేమిటనేదానిపై సమగ్ర విచారణ చేపట్టాలని మావ్లేదార్ మిత్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
CCTV Footage of the attack on Lavoo Mamlatdar
Former MLA Lavoo Mamledar dies after a spat with a local in Khade Bazar, Belagavi #BelgaumCrime #BelgaumPolice #CrimeInBelgaum #BelgaumNews #KarnatakaCrime #BelgaumCrimeNews #BelgaumLawAndOrder #BelgaumSafety #BelgaumSecurity pic.twitter.com/QGp49eE2Yc
— Prudent Media (@prudentgoa) February 15, 2025