Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్‌పై దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
- By Kavya Krishna Published Date - 03:21 PM, Thu - 7 August 25

Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్‌పై దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విఫలమైంది అంటూ విమర్శించారు. ‘‘ఇది గత 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై నెట్టివేయలేని విదేశాంగ వైఫల్యం’’ అంటూ ట్విటర్‌లో (X) ఆయన మండిపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు. తాజాగా మరోసారి ప్రకటించిన విధంగా ఇది 50 శాతానికి పెరిగింది. దీని ప్రభావంతో భారత్‌కు భారీ ఆర్థిక నష్టం తప్పదని ఖర్గే అన్నారు. “2024లో అమెరికాకు మన ఎగుమతులు రూ.7.51 లక్షల కోట్ల మేర ఉన్నాయని భావిస్తే, 50% టారిఫ్ అంటే దాదాపు రూ.3.75 లక్షల కోట్లు భారం విధించే ప్రమాదం ఉంది” అని చెప్పారు.
America : భారత్-చైనా-రష్యా ఈ మూడు కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి?
ఈ ప్రభావం చిన్నతరహా పరిశ్రమలు (MSMEs), వ్యవసాయం, డైరీ, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాలూ ఆభరణాలూ, ఔషధాలు, పెట్రోలియం ఉత్పత్తులు, కాటన్ గార్మెంట్స్ పై తీవ్రంగా ఉండబోతుందని హెచ్చరించారు. ట్రంప్ చేసిన హెచ్చరికలు, వ్యాఖ్యలపై మోదీ మౌనం వీలవదని ఖర్గే ఆరోపించారు. “ట్రంప్ ఇప్పటికే BRICS సమ్మిట్‌లో BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని చెబుతూ ఆ సమితి ‘చచ్చిపోయింది’ అని వ్యాఖ్యానించాడు. మోదీ అక్కడే కూర్చుని నవ్వుతూ చూశారు” అని విమర్శించారు.
అంతేకాకుండా ట్రంప్ ఎప్పటి నుంచో ‘రీసిప్రోకల్ టారిఫ్’ల గురించి మాట్లాడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎలాంటి వ్యూహాలు తీసుకురాలేదని, మంత్రులు వాషింగ్టన్‌లో కూర్చున్నా ఏ ఒప్పందం సాధించలేకపోయారని ఆయన విమర్శించారు.
భారత ప్రభుత్వం కూడా తాజా టారిఫ్ పెంపుపై తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేసింది. “ఇది అన్యాయం, అసంబద్ధం, అప్రామాణికం” అని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, భారతీయ మౌలిక అవసరాల కోసం చమురు దిగుమతులు జరుగుతున్నాయని, ఇందులో రాజకీయాలేమీ లేవని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ మాత్రం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ‘‘భారత్ భారీగా రష్యా చమురును కొని, దానిని మళ్లీ అమ్ముతూ లాభపడుతోంది. ఉక్రెయిన్‌లో ఎంతమంది చనిపోతున్నారో వారికి పడట్లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
టారిఫ్ పెంపు నిర్ణయం వాస్తవానికి అమెరికా ప్రత్యేక దౌత్యనాయకుడు స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో పుతిన్‌తో భేటీ అయిన మరుసటి రోజే తీసుకోవడం గమనార్హం. ఇది అమెరికా అసలైన ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక ట్రంప్ ఇప్పటికే భారత్‌పై మరోసారి అదనపు టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించిన నేపథ్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఖర్గే చివరిగా మోదీని ఉద్దేశిస్తూ, ‘‘ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారు. ఇది విదేశాంగ విధాన పరాజయం. ఇది కాంగ్రెస్ పైనే నెట్టేయలేరు’’ అని విమర్శించారు.
India Mauritius : మారిషస్‌కు భారత్ బహుమతిగా విద్యుత్ బస్సులు.. రెండు దేశాల మధ్య మైత్రీకు కొత్త ఊపు